Begin typing your search above and press return to search.

కంగనా వాట్సాప్, పర్సనల్ డేటా లీక్.. ఆ హీరో పనేనా?

By:  Tupaki Desk   |   5 Feb 2023 6:29 PM GMT
కంగనా వాట్సాప్, పర్సనల్ డేటా లీక్.. ఆ హీరో పనేనా?
X
బాలీవుడ్ స్టార్ నటి కంగనా రనౌత్ ఎప్పుడు సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. అయితే తాజాగా మరోసారి సంచలన ఆరోపణలు చేసింది. తనపై ఎవరో గూఢచర్యానికి పాల్పడుతున్నారని ఆరోపించింది. తన ప్రతి కదలికను గమనిస్తూ తన వ్యక్తిగత, వృత్తి పరమైన సమాచారాన్ని లీక్ చేస్తున్నారని తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసింది. దీనిపై తన ఇన్‌స్టాలో స్టోరీస్‌లో సుదీర్ఘమైన నోట్ రాసింది. అయితే ఆమె ఆరోపణలు చేసింది బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్‌బీర్ కపూర్‌, ఆలియా భట్ పై అని ప్రచారం సాగుతోంది.

'నేను ఎక్కడికెళ్లినా నన్ను ఫాలో అవుతున్నారు. నాపై గూఢచర్యం చేస్తున్నారు. వీధుల్లో మాత్రమే కాకుండా నా బిల్డింగ్ పార్కింగ్, నా హౌస్ టెర్రస్‌లో ఉన్నపుడు కూడా నన్ను చూసేందుకు జూమ్ లెన్స్‌లు ఏర్పాటు చేశారు. ఫోటో గ్రాఫర్ మాత్రమే నక్షత్రాలను సందర్శిస్తారని అందరికీ తెలుసు. కానీ ఈ రోజుల్లో వారు నటీనటులుగా మారారు.

ఉదయం 6:30 గంటలకు నా ఫోటోలు తీశారు. వారికి నా షెడ్యూల్‌ గురించి ఎలా తెలుస్తోంది. ఈ చిత్రాలతో వారు ఏం చేస్తారు? నా వాట్సాప్ డేటా, ప్రొఫెషనల్ అగ్రిమెంట్స్, వ్యక్తిగత వివరాలు కూడా లీక్ అవుతున్నాయి. అసలతడు ఒకప్పుడు నా ఆహ్వానం లేకుండా నా ఇంటికి వచ్చి నన్ను బలవంతం చేశాడు.

ఇప్పుడు అతని భార్యను నాలాగా నిర్మాతగా మారాలని.. ఇంకా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేయమని.. నాలాగా దుస్తులు ధరించాలనీ, నా ఇంటిలా తన ఇంటి ఇంటీరియర్‌లను తయారు చేయమని బలవంతం చేస్తున్నాడు. ఇంకా వారు నా స్టైలిస్ట్, హోమ్ స్టైలిస్ట్‌లను కూడా నియమించుకున్నారు. అతని భార్య కూడా దీన్నీ ప్రోత్సహిస్తోంది. నా ఫైనాన్షియర్లు, వ్యాపార భాగస్వాములు ఎటువంటి కారణం లేకుండా చివరి నిమిషంలో ఒప్పందాలను విరమించుకున్నారు. అతను నన్ను ఒంటరిని చేసి, మానసిక ఒత్తిడికి గురిచేయడానికి ప్రయత్నిస్తున్నాడని నేను భావిస్తున్నా" అని ఆమె రాసుకొచ్చింది.

ఇంకా అలియాకు పరోక్షంగా సూచనలు కూడా చేసింది. "వారిద్దరూ ఒకే భవనంలో విడివిడిగా నివసిస్తున్నారు. దీనినీ ఆమె వ్యతిరేకించాలి. అతనిపై ఓ కన్ను వేసి ఉంచాలి. అతను నా డేటా మొత్తాన్ని ఎలా పొందుతున్నాడు. అతను ఇబ్బందుల్లో పడితే, ఆమెతో పాటు బిడ్డ కూడా ఇబ్బందుల్లో పడుతుంది.

ఆమె తన జీవితానికి బాధ్యత వహించాలి. అతను ఎలాంటి చట్టవిరుద్ధమైన పనుల్లో పాల్గొనకుండా చూడాలి. ప్రియమైన నీపై, నీ బిడ్డపై నాకు చాలా ప్రేమ ఉంది' అంటూ పరోక్షంగా ఆలియా భట్‌ను ఉద్దేశించి రాసిందని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.