Begin typing your search above and press return to search.

నిజంగానే ఫైర్ బ్రాండ్‌ కొత్త చంద్రముఖి తో జాయిన్‌ అయ్యింది

By:  Tupaki Desk   |   6 Dec 2022 11:30 PM GMT
నిజంగానే ఫైర్ బ్రాండ్‌ కొత్త చంద్రముఖి తో జాయిన్‌ అయ్యింది
X
తమిళ సూపర్ స్టార్‌ రజినీకాంత్‌ హీరోగా జ్యోతిక మరియు నయనతార హీరోయిన్స్ గా తెరకెక్కిన చంద్రముఖి సినిమా ఎంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చంద్రముఖి సినిమా తెలుగులో కూడా డబ్ అయ్యి అప్పట్లో రికార్డు స్థాయి కలెక్షన్స్ ను నమోదు చేసింది. ఇప్పుడు చంద్రముఖి 2 సినిమా రాబోతుంది.

పి వాసు దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ లో రూపొందుతున్న చంద్రముఖి 2 సినిమా యొక్క షూటింగ్‌ కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి అంటూ ఆ మధ్య తమిళ మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ సినిమాలో రజినీకాంత్‌ కాకుండా లారెన్స్ హీరోగా నటిస్తున్న విషయం తెల్సిందే. ఇక చంద్రముఖి పాత్ర ను పోషించబోతున్నది ఎవరు అనేది గత కొన్ని రోజులుగా చర్చనీయాంశంగా మారింది.

పలువురి పేర్లు ప్రస్తావనకు వచ్చాయి. ఆ మధ్య బాలీవుడ్‌ ఫైర్ బ్రాండ్‌ స్టార్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్ చంద్రముఖి 2 సినిమాలో నటించబోతుంది అంటూ వార్తలు వచ్చాయి. చాలా మంది కంగనా నిజంగా సౌత్‌ సినిమా చంద్రముఖిలో నటించబోతుందా అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు.

ఇప్పుడు ఆ వార్తలు నిజమే అన్నట్లుగా చంద్రముఖి 2 సినిమా షూటింగ్ లో కంగనా జాయిన్ అయ్యింది. ఒక వైపు ఎమర్జెన్సీ సినిమా షూటింగ్‌ లో పాల్గొంటూ ఉన్న కంగనా నిన్నటి నుండి చంద్రముఖి 2 యూనిట్‌ సభ్యులతో కలిసి వర్క్ మొదలు పెట్టిందట.

చంద్రముఖి సినిమా కు ముందు జరిగిన కథతో అంటే ప్రీ క్వెల్‌ కథతో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లుగా దర్శకుడు వాసు చెబుతున్నాడు. ఈ మధ్య కాలంలో వాసు దర్శకత్వంలో సినిమా అంటే ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు.

అయితే ఈ సినిమా తో మరోసారి తన సత్తా ఏంటో చూపిస్తాను అనే నమ్మకంతో వాసు ఉన్నాడట. కంగనా ఎంట్రీతో చంద్రముఖి 2 సినిమా స్థాయి బాగా పెరిగింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.