దీపికకు కంగనా కౌంటర్

Fri Jan 17 2020 23:00:01 GMT+0530 (IST)

Kangana Raunat Comments on Deepika Padukone

పౌరసత్వ బిల్లు నేపథ్యంలో ఢిల్లీ జేఎన్ యూ విద్యార్థులు చేస్తున్న ఆందోళనలో ఉద్రిక్తత నెలకొన్న విషయం తెల్సిందే. జేఎన్ యూలో జరిగిన ఘటనపై పలువురు బాలీవుడ్ స్టార్స్ స్పందించారు. అయితే దీపిక పదుకునే మాత్రం ఏకంగా యూనివర్శిటీకి వెళ్లి జేఎన్ యూ విద్యార్థులకు మద్దతుగా నిలిచిన విషయం తెల్సిందే. దీపిక చేసిన పనిపై బీజేపీ నాయకులు మరియు కేంద్ర మంత్రులు పలువురు చాలా సీరియస్ అయ్యారు. ఆమె దేశ ద్రోహులకు మద్దతుగా నిలుస్తుందంటూ సోషల్ మీడియాలో కూడా కామెంట్స్ వస్తున్నాయి.ఆమె నటించిన తాజా చిత్రం ప్రమోషన్ కోసం ఆమె ఇలా చేసిందనే వారు కూడా చాలా మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో కంగనా స్పందిస్తూ తాను దీపిక జేఎన్ యూ వెళ్లడంపై స్పందించాలనుకోవడం లేదు. కాని దేశాన్ని విచ్చిన్నం చేసి మన సైనికులు చనిపోతే వేడుకలు చేసుకునే వారికి మద్దతుగా మాత్రం నేను నిలువను. తుక్డే గ్యాంగ్ వెనుక నిల్చోవాలని నేను అనుకోవడం లేదు. ఆమెకు ఎవరికి మద్దతు అయినా ఇచ్చే అర్హత ఉంది.. ఎక్కడకు వెళ్లి అయినా మద్దతు తెలిపే హక్కు ఉందని కంగనా కౌంటర్ వేసింది. కంగనా కౌంటర్ కు దీపిక ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.