జయలలిత రూపం కోసం ప్రోస్తటిక్స్

Fri Sep 20 2019 21:29:19 GMT+0530 (IST)

Kangana Ranaut undergoes extensive prosthetic prep for Thalaivi in the US

బాలీవుడ్ రౌడీ క్వీన్ కంగననౌత్ స్టైలే వేరు. ఏటికి ఎదురెళ్లడం తనకు మాత్రమే చెల్లింది. ప్రస్తుతం కంగన ఓ భారీ మిషన్ ని చేపట్టింది. పురుచ్చితలైవి .. ఐరన్ లేడీ జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న బహుభాషా చిత్రం `తలైవి`తో సంచలనం సృష్టించడమే ఈ మిషన్ లక్ష్యం. ఈ చిత్రానికి ఏఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా బెంగళూరులో ప్రారంభం కానుంది. ఇప్పటికే జయలలిత లుక్ కోసం అమెరికా లాస్ ఏంజెల్స్ కి వెళ్లిన ఈ అమ్మడు మేకప్ టెస్ట్‌ల్ని ఈ రోజే మొదలుపెట్టింది. అమ్మ లుక్ ఎలా వుండాలి? హావభావాల్ని ఎలా పలికించాలి? అన్న విషయాలపై ఇప్పటికే ఓ అవగాహనకు వచ్చిన కంగన మేకప్ టెస్టులతో క్లారిటీకి వస్తోందిట.ఈ లుక్ టెస్ట్ కోసం కెప్టెన్ మార్వెల్- బ్లేడ్ రన్నర్ చిత్రాలకు పనిచేసిన హాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్ జాసన్ కొలిన్స్ పర్యవేక్షణలో ప్రోస్తటిక్ మేకప్ టెస్ట్ జరుగుతోంది. రకరకాల లుక్స్ ని ట్రై చేస్తూ అమ్మ పాత్ర కోసం కంగన సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వైట్- గ్రీన్- బ్లూ కలర్ ప్రోస్తటిక్ మేకప్ లో కంగన కనిపిస్తున్న తీరు సినిమాపై ఆసక్తిని పెంచేస్తోంది. `తలైవి` చిత్రాన్ని ప్రకటించిన దగ్గరి నుంచి జయలలిత పాత్రని కంగన ఎలా పోషిస్తుందా?. ప్రేక్షకుల్ని ఎలా ఆకట్టుకుంటుందా? అనే ఆసక్తి కనిపిస్తోంది.

ఇప్పటికే ఈ చిత్రం కోసం కంగన తమిళ భాషతో పాటు భరతనాట్యం నేర్చుకుంటోంది. భారీ క్యాస్టింగ్ తో అత్యంత భారీ స్థాయిలో మూడు భాషల్లో నిర్తిస్తున్న ఈ చిత్రాన్ని అక్టోబర్‌లో ప్రారంభించబోతున్నారు. కేవలం ఒక ప్రాంతీయ భాషా చిత్రంగా కాకుండా పాన్ ఇండియన్ సినిమాగా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో ప్రేక్షకులకు అందిస్తామని నిర్మాత విష్ణు ఇందూరి తెలిపారు. ఇందులో కీలక పాత్రల కోసం దక్షిణాదికి చెందిన టాప్ స్టార్స్‌ని సంప్రదిస్తున్నారట.