గుడిలో డాన్స్ వేసిన స్టార్ హీరోయిన్

Tue Jan 22 2019 07:00:01 GMT+0530 (IST)

బాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకున్న కంగనా రనౌత్ మరి కొన్ని రోజుల్లోనే 'మణికర్ణిక' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రంను కంగనా ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించడంతో పాటు దర్శకత్వం కూడా వహించింది. క్రిష్ చేసిన ఈ చిత్రానికి కంగనా మార్పులు చేర్పులు చేసింది. గత కొన్ని రోజులుగా సినిమా ప్రమోషన్ లో భాగంగా తెగ బిజీగా గడిపేస్తున్న  ఈ అమ్మడు తాజాగా తన సొంత రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్ కు వెళ్లింది.హిమాచల్ ప్రదేశ్ మండి లోని ఒక గుడిని కంగనా రనౌత్ విజిట్ చేసింది. సినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో పాటు దైవ దర్శణం కూడా కంగనా చేసుకుంది. ఇక గుడిలో దర్శణం తర్వాత కంగనా కొందరు లేడీ డాన్సర్స్ తో కలిసి గుడిలో డాన్స్ చేసింది. ఆ గుడిలో కంగనా డాన్స్ వేయడంతో ఒక్కసారిగా ఆ గుడి గురించి తెలుసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఆ గుడిలో ఎందుకు కంగనా డాన్స్ వేయాల్సి వచ్చిందనే ప్రశ్నలు ప్రస్తుతం జనాలను తొలుస్తున్నాయి. తన సొంత ప్రాంతం అవ్వడం వల్ల కంగనా డాన్స్ చేసి ఉంటుంది అంతకు మించి ఏమీ ఉండదు అంటూ మరి కొందరు అంటున్నారు. మొత్తానికి కంగనా వేసిన టెంపుల్ స్టెప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.