పాపం... కంగనాకి టాలీవుడ్ స్టార్ హీరో పరిస్థితి!

Wed May 25 2022 06:00:01 GMT+0530 (IST)

Kangana Ranaut is a Tollywood star hero situation

టాలీవుడ్ లో ఒక స్టార్ హీరో మొన్నటి వరకు ఇండస్ట్రీలో బయట చాలా గౌరవించబడ్డాడు. ఆయన తాను ముక్కు సూటిగా మాట్లాడుతాను... ఎవరినైనా ప్రశ్నిస్తాను... నా అంత ప్రతిభావంతులు ఎవరు లేరు.. ఇండస్ట్రీలో చాలా మంది కంటే నేనే గొప్ప నటుడిని అంటూ చాలా చాలా చాలా రకాలుగా చెప్పుకున్నాడు. ఆయన కుటుంబ సభ్యులు కూడా ఆయన్ను ఆహా ఓహో అన్నట్లుగా పొగడ్తల్లో ముంచెత్తేవారు.ఆ స్టార్ నటుడు కుటుంబ సభ్యులు కూడా ఈమద్య కాలంలో మేమే ఇండస్ట్రీలో గ్రేట్ అన్నట్లుగా చెప్పుకోవడం మొదలు పెట్టడంతో జనాల్లో మొత్తం ఆ ఫ్యామిలీపై అసంతృప్తి మొదలయ్యింది. సోషల్ మీడియాలో వారి గురించి ఆకాశమే హద్దు అన్నట్లుగా ట్రోల్స్ రావడం మొదలు అయ్యింది. అయినా కూడా మేమే గొప్ప అన్నట్లుగా వారు ఊహించుకుంటూ ఊహల్లో బతికేస్తూ వచ్చారు.

ఇటీవల ఆ ఫ్యామిలీ నుండి రెండు సినిమాలు వచ్చి పెట్టుబడిలో కనీసం 10 శాతం వసూళ్లను కూడా రాబట్టలేక పోయాయి. ఓటీటీ లో విడుదల అయినా పట్టించుకునే వారే లేరు. ఒకప్పుడు ఆ ఫ్యామిలీ అంటే ఎంతో గౌరవించిన వారు కూడా ఇప్పుడు లైట్ తీసుకుంటున్నారు. ఇప్పుడు అదే పరిస్థితి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ఎదుర్కొంటుంది.

తాను గొప్ప నటిని అని.. తనను మించిన వారు బాలీవుడ్ లో లేరంటూ పదే పదే చెప్పుకుంటూ కంగనా ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ను మూట కట్టుకుంది. కంగనా ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరోలను కూడా తనకంటే తక్కువే అన్నట్లుగా తీసి పారేసింది. ఎంతో మంది బాలీవుడ్ స్టార్స్ తో సున్నం పెట్టుకున్నా కూడా తాను బాలీవుడ్ లోనే టాప్ స్టార్ ను అనుకుంటూ వచ్చింది.

ఈమె అతి వ్యాఖ్యలు.. చేష్టలు ప్రేక్షకులకు ఎగటు పుట్టే విధంగా మారాయి. ఆమె సినిమాలు అంటే జనాలు లైట్ తీసుకునే పరిస్థితికి వచ్చారు. ఈమద్య కాలంలో ఆమె నటించిన సినిమాల్లో దాదాపు అన్ని కూడా డిజాస్టర్స్ గానే నిలిచాయి. ప్రతి ఒక్క సినిమా లో కూడా ఆమె ఓవర్ యాక్షన్.. ఆ సినిమా విడుదల సమయంలో ఆమె చేసే వివాదాస్పద వ్యాఖ్యలు మాత్రమే చర్చకు వస్తుంది.

నాలుగు అయిదు సంవత్సరాల క్రితం కంగనా రనౌత్ గురించి పాజిటివ్ గా మాట్లాడుకున్న వారే ఆమె కేవలం వివాదం సృష్టించడం కోసం వ్యాఖ్యలు చేస్తుందని.. ఆమె ప్రతి విషయాన్ని కూడా రాద్దాంతం చేస్తూ వివాదాన్ని పెంచి తన సినిమాలకు పబ్లిసిటీ చేసుకుంటుంది తప్ప.. సినిమాల్లో మ్యాటర్ లేదని తాజాగా విడుదల అయిన ధాకడ్ సినిమా చెప్పకనే చెప్పింది.

ఆహా ఓహో అంటూ ప్రచారం చేసిన ధాకడ్ సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది. ఇప్పుడు కంగనా పరిస్థితి చాలా దారుణంగా మారింది.. ముందు ముందు అయినా ఆమె తన పద్దతిని మార్చుకుని ఫైర్ బ్రాండ్ ఇమేజ్ నుండి బయటకు వస్తుందా అనేది చూడాలి. అలా రాకుంటే మాత్రం ఆమె కెరీర్ మరో రెండు మూడు సినిమాల తర్వాత లేదా రెండు మూడు సంవత్సరాల తర్వాత క్లోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.