Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : ఫైర్‌ బ్రాండ్‌ స్కిన్‌ షో చేస్తే ఇలా ఉంటుంది

By:  Tupaki Desk   |   1 Aug 2021 9:30 AM GMT
పిక్ టాక్ : ఫైర్‌ బ్రాండ్‌ స్కిన్‌ షో చేస్తే ఇలా ఉంటుంది
X
బాలీవుడ్‌ ఫైర్ బ్రాండ్‌ అనగానే ఠక్కున వినిపించే పేరు కంగనా రనౌత్‌ అనడంలో సందేహం లేదు. ఆమె ప్రతి మాట కూడా వివాదం అన్నట్లుగానే ఉంటుంది. అవతలి వారు ఎంత పెద్ద వారు అయినా కూడా తాను అనుకున్నది మాట్లాడటం కంగనాకే చెల్లింది అనడంలో సందేహం లేదు. కంగనా రనౌత్‌ బాలీవుడ్‌ లో ఎంతో మంది దిగ్గజ స్టార్స్ తో మరియు ఫిల్మ్‌ మేకర్స్ తో గొడవ పెట్టుకుంది. పెద్ద ఎత్తున వివాదాలకు కేంద్ర బింధువుగా నిలిచే కంగనా నటన విషయంలో మాత్రం విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంటుంది అనడంలో సందేహం లేదు.

స్టార్‌ గా కాస్త పొగరును కనబర్చుతుంది అంటూ కంగనా పై అభియోగాలు ఉన్నాయి. ఆమె స్వభావం అంది అంటూ కొందరు అంటూ ఉంటారు. సహజంగా స్కిన్ షోకు ఆసక్తి చూపించని కంగనా రనౌత్‌ తాజాగా ఈ ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ఈ గ్రీన్ డ్రస్‌ లో ఆమె అందాల ఆరబోతకు ఫిదా అవుతున్నారు. క్లీవేజ్ షో తో పాటు స్కిన్‌ టోన్‌ కు సరిగ్గా సెట్‌ అయ్యే ఆమె ఔట్‌ ఫిట్‌ ను అంతా కూడా ప్రశంసిస్తున్నారు. అంతా బాగానే ఉన్నా కూడా ఒక్క విషయంలో మాత్రం ఆమెను అభిమానులు మరియు నెటిజన్స్ కామెంట్స్‌ చేస్తున్నారు.

సహజంగా ఇలాంటి హాట్‌ స్కిన్ షో చేస్తున్న సమయంలో హీరోయిన్స్ స్మైల్‌ లేదా సిగ్గు పడుతూ లేదంటే రొమాంటిక్ చూపుతో ఫోజ్‌ ఇస్తారు. కాని కంగనా మాత్రం తన బ్రాండ్‌ కు తగ్గట్లుగా కళ్లలో అదే ఫైర్‌ ను చూపిస్తుంది. ఫేస్ లో సీరియస్‌ నెస్ మరియు కళ్లలో కాస్త కోపం అన్నట్లుగా కంగనా లుక్‌ ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాస్త రొమాంటిక్ గా ఈమె ఉండి ఉంటే ఈ ఔట్ ఫిట్ లో ఆమె మరింత అద్బుతంగా కనిపించేది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. మొత్తానికి ఫైర్ బ్రాండ్‌ స్కిన్‌ షో చేస్తే.. అందాలను ఆరబోస్తే ఇలా ఉంటుందని ఈ ఫొటోను బట్టి అర్థం చేసుకోవచ్చు.