Begin typing your search above and press return to search.

10 ఏళ్ల‌లో ఇదే మొద‌టి స‌క్సెస్.. అంటే ఖాన్ కి 10 ఫ్లాపులు?

By:  Tupaki Desk   |   29 Jan 2023 8:00 AM GMT
10 ఏళ్ల‌లో ఇదే మొద‌టి స‌క్సెస్.. అంటే ఖాన్ కి 10 ఫ్లాపులు?
X
ట్విట్ట‌ర్ లో మ‌ళ్లీ డ్రాకులా ప్ర‌వేశించింది. అక్క‌డ అంద‌రికీ చెమ‌ట‌లు ప‌ట్టించేలా ఆట‌ప‌ట్టిస్తోంది. అది కూడా ఎవ‌రిని? అంటే.. డైరెక్టుగా ఖాన్ ల‌నే ఎటాక్ చేస్తోంది. అందునా కింగ్ ఖాన్ టార్గెటెడ్ గా టీజ్ చేస్తోంది.

ఇంత‌కీ ఎవ‌రీ డ్రాకులా? అంటే.. క‌చ్ఛితంగా ఖాన్ ల పాలిట శ‌త్రువు బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ అన‌డంలో సందేహం లేదు. వివాదాస్ప‌ద‌ క్వీన్ కంగ‌నను ట్విట్ట‌ర్ నిషేధించిన సంగ‌తి తెలిసిందే. కానీ కొంత గ్యాప్ త‌ర్వాత స‌డ‌లింపు ల‌భించింది. దీంతో కంగ‌న‌ మళ్లీ ట్విట్టర్ లోకి వచ్చింది. వ‌స్తూనే హిందీ చిత్ర పరిశ్రమలోని గ‌తుకుల రోడ్ ని త్రవ్వడం ప్రారంభించింది.

తాజాగా పఠాన్ గురించి ట్వీట్ చేసి షారుఖ్ ఖాన్ అభిమానులకు కోపం తెప్పించింది. తన చివరి సినిమా 'ధాకడ్' బాక్సాఫీస్ పరాజయాన్ని చవిచూసిందంటూ ఓ యూజర్ చేసిన ట్వీట్ పై కంగనా ప్ర‌తిస్పందించింది. ఈ వ్యాఖ్యపై కంగనా స్పందిస్తూ.. త‌న‌ భారీ యాక్షన్ చిత్రం పేలవంగా ఆడిందంటూ అంగీకరించింది. జీ సినిమాస్ చిత్రం 'ధాకడ్' మొదటి రోజు 55 లక్షల రూపాయలు ..జీవితకాల కలెక్షన్ 2.58 కోట్లు రాబట్టింది అని వినియోగదారు ట్వీట్ లో గుర్తు చేస్తూ 'పఠాన్' తొలిరోజు 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిందని పోల్చాడు. ఇది మీలో నిరాశ‌ను మిగిల్చిందంటూ కంగ‌న‌ను స‌ద‌రు నెటిజ‌న్ గిల్లే ప్ర‌య‌త్నం చేసాడు.

దానికి కంగనా వెంటనే ధీటైన‌ సమాధానమిచ్చారు.''అవును.. ధాకడ్ ఒక చారిత్రాత్మక ఫ్లాప్.. నేను దీన్ని ఎప్పుడు ఖండించాను? పదేళ్లలో SRK జీకి ఇది మొదటి విజయవంతమైన చిత్రం. మేం కూడా అతనిని స్ఫూర్తిగా తీసుకుంటాం. భారతదేశం అతనికి ఇచ్చిన అలాంటి అవకాశం మ‌న‌కు కూడా లభిస్తుందని నేను ఆశిస్తున్నాను. ఇంతకీ భారతదేశం గొప్పదని తెలుసుకోండి. దేశం ఎంతో ఉదారమైనది.. జై శ్రీరామ్'' అని కంగ‌న కౌంట‌ర్ వేసింది.

అంతకుముందు రోజు పఠాన్ బాక్సాఫీస్ విజయానికి కంగ‌న త‌న‌దైన నిర్వ‌చ‌నం చెప్పారు. ఇది 'ద్వేషంపై ప్రేమ విజయం' అని అభివ‌ర్ణిస్తూ ట్వీట్ చేసారు. కానీ ఈ ద్వేషం ఎవ‌రు ఎవ‌రిపై చూపించారు? పాకిస్తాన్ ని ఐ.ఎస్.ఐ.ఎస్ ని హైలైట్ గా చూపిస్తారా? అంటూ ప్ర‌శ్నించింది. అప్ప‌టికే ఒక‌సారి షారూఖ్ ని ప్ర‌శంసించినా కానీ ఆ మ‌రుస‌టి రోజే కంగ‌న కొత్త ప‌ల్ల‌వి అందుకుంది. ప‌ఠాన్ లోని లోపాలపై నిప్పులు చెరిగింది.

మోస్ట్ అవైటెడ్ యాక్షన్ చిత్రం 'ప‌ఠాన్' గత బాలీవుడ్ చిత్రాల రికార్డులన్నింటినీ బద్దలు కొడుతోంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా హృదయాలను గెలుచుకుంది. బాయ్ కాట్ హ్యాష్ ట్యాగ్ ప్ర‌మాదం పొంచి ఉన్నా కానీ రిలీజ్ ముంగిట ఎక్క‌డా ఖాన్ బ‌య‌ట‌ప‌డ‌కుండా హుందాగా వ్య‌వ‌హ‌రిస్తూ త‌న సినిమాని గెలిపించుకున్నాడు. పఠాన్ బాక్సాఫీస్ వద్ద అనూహ్యంగా మంచి ప్రదర్శన కనబరుస్తోంది. పఠాన్ బాక్సాఫీస్ వసూళ్ల లో తొలి రెండు రోజులు ఆక‌ట్టుకోగా.. డే 3లో షారూఖ్ ఖాన్-దీపికా పదుకొణె నటించిన ఈ చిత్రం వ‌సూళ్ల‌లో స్వల్పంగా తగ్గుముఖం పట్టింది.

నిజానికి కంగ‌న ప్ర‌స్థావించినట్టు ట్రాక్ రికార్డును ప‌రిశీలిస్తే కింగ్ ఖాన్ కి ఈ ప‌దేళ్ల‌లో స‌రైన విజ‌యం లేద‌నేది అభిమానులు గుర్తించాలి. 2012లో జ‌బ్ త‌క్ హై జాన్ యావ‌రేజ్. 2013 లో బాంబే టాకీస్ ఫ్లాప్. అదే ఏడాది వ‌చ్చిన చెన్నై ఎక్స్ ప్రెస్ బ్లాక్ బ‌స్ట‌ర్. 2014లో భూత్ నాథ్ రిట‌ర్న్స్ లో కామియో చేశాడు. 2015లో దిల్ వాలే ఆశించినంత ఆడ‌లేదు. త‌ర్వాత 2016 ఫ్యాన్ బిగ్ డిజాస్ట‌ర్. ఏ దిల్ హై ముస్కిల్ అదే ఏడాది విడుద‌లై యావ‌రేజ్ గా ఆడింది. 2017లో రాయీస్ ఓకే మూవీ. అదే ఏడాది జ‌బ్ హ్యారీ మెట్ సీజ‌ల్ ఫ‌ర్వాలేద‌నిపించింది. 2018లో వ‌చ్చిన జీరో డిజాస్ట‌ర్ల‌కే బాప్ గా నిలిచింది.

లాల్ సింగ్ చ‌డ్డాలో అతిథి పాత్ర‌లో న‌టించినా ఆ సినిమాని కింగ్ ఖాన్ కాపాడ‌లేక‌పోయాడు. బ్ర‌హ్మాస్త్ర ర‌ణ‌బీర్ సినిమా. ఇందులో ఖాన్ ఒక కామియోలో క‌నిపించాడు. 2023లో ప‌ఠాన్ బ్లాక్ బ‌స్ట‌ర్ దిశ‌గా దూసుకెళుతోంది. అంటే ఇన్నేళ్ల పాటు కింగ్ ఖాన్ కి చెప్పుకోదగ్గ బ్లాక్ బ‌స్ట‌ర్ అయితే లేదు... ఒక్క చెన్నై ఎక్స్ ప్రెస్ త‌ప్ప‌! అత‌డు న‌టించిన అతిథి పాత్ర‌లు మిన‌హాయిస్తే .. హీరోగా న‌టించిన‌వేవీ స‌రిగా ఆడ‌లేదు. కానీ సువిశాల‌మైన రెడ్ చిల్లీస్ సామ్రాజ్య స్థాపకుడిగా ఖాన్ ఇండ‌స్ట్రీలో గొప్ప‌గా సేవ్ అయ్యాడు. అట్లీ జ‌వాన్ - రాజ్ కుమార్ హిరాణీ- డుంకీ చిత్రాలు త‌దుప‌రి విడుద‌ల కావాల్సి ఉంది. స‌ల్మాన్ 'టైగ‌ర్ 3'లో అతిథిగా షారూఖ్‌ న‌టిస్తున్నాడు. వీట‌న్నిటిపైనా ఖాన్ బోలెడ‌న్ని హోప్స్ పెట్టుకున్నాడు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.