మరోసారి కేఆర్కే వివాదాస్పద ట్వీట్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..!

Tue Dec 06 2022 22:00:01 GMT+0530 (India Standard Time)

Kamal R Khan Tweet on Disaster Movies

బాలీవుడ్ సినిమాలపై తరుచూ విమర్శలు చేస్తూ కమాల్ ఆర్ ఖాన్ అనే నటుడు దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్నాడు. తనకు తానే సినీ క్రిటిక్ గా చెప్పుకుంటూ పాపులర్ సినిమాలకు సైతం అతి తక్కువ రేటింగ్ ఇస్తూ వివాదాలకు కారణమవుతూ వస్తున్నాడు. ఈ వ్యవహారంలో కేఆర్కే అనేక ఇబ్బందులు సైతం ఎదుర్కోవాల్సి వచ్చింది.అయినప్పటికీ కమాల్ ఆర్ ఖాన్ బాలీవుడ్.. ప్యాన్ ఇండియా సినిమాలపై మాత్రం వివాదాస్పద ట్వీట్స్ మాత్రం ఆపడం లేదు. తాజాగా బాలీవుడ్ సూపర్ హిట్టుగా నిలిచిన.. ప్యాన్ ఇండియా లెవల్లో భారీ కలెక్షన్లు రాబట్టిన పలు చిత్రాలను సైతం కేఆర్కే డిజాస్టర్ లిస్టులో చేరుస్తూ ట్వీట్ చేయడం వైరల్ గా మారింది.

కమాల్ ఆర్ ఖాన్ తన ట్వీట్లో టాప్ 5 డిజాస్టర్ మూవీలను ప్రకటించాడు. ఇందులో బాలీవుడ్లో సూపర్ హిట్టుగా నిలిచిన 'బ్రహ్మస్త్ర'.. ప్యాన్ ఇండియా బ్లాక్ బస్టర్ మూవీ 'ఆర్ఆర్ఆర్' సైతం ఉన్నాయి. 'బహ్మస్త్ర' మూవీ వల్ల నిర్మాతకు 300 కోట్ల మేర నష్టం వాటిల్లగా 'ఆర్ఆర్ఆర్' మూవీతో 200 కోట్ల నష్టం వాటిల్లిందని మరో ట్వీట్ లో పేర్కొన్నాడు.

ఇక ఈ లిస్టులో అక్షయ్ కుమార్ నటించిన 'పృథ్వీరాజ్ చౌహన్'.. అమీర్ ఖాన్ నటించిన 'లాల్ సింగ్ చడ్డా'.. హృతిక్ రోషన్ రీ సెంట్ మూవీ 'విక్రమ్ వేద' ఉన్నాయి. పృథ్వీరాజ్ చౌహన్ మూవీ వల్ల నిర్మాతకు 100 కోట్ల నష్టం రాగా.. లాల్ సింగ్ చడ్డాతో 125 కోట్లు.. విక్రమ్ వేదాతో 100 కోట్ల నష్టం వాటిల్లిందని కేఆర్కే తన ట్వీట్ లో రాసుకొచ్చాడు.

కేఆర్కే ట్వీట్ పై నెటిజన్లు సైతం తమదైన శైలిలో స్పందిస్తున్నారు. 'ఆర్ఆర్ఆర్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా 1200 కోట్లు వసూలు చేసిందని.. ఇంకా జపాన్ భాషల్లోనూ రిలీజ్ అక్కడ కూడా వసూళ్లను రాబడుతుందని గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మీరు చెప్పింది.. నిజామా? అంటూ పలువురు ఆశ్చర్యపోతుండగా మరికొందరు మాత్రం ఆయన చెప్పేవన్నీ ఫేక్ అంటూ కొట్టి పారేస్తున్నారు.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.