ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ మీద పడ్డాడు

Fri May 24 2019 15:29:34 GMT+0530 (IST)

నటుడిగా నిర్మాతగా పొడిచింది ఉద్దరించింది ఏమి లేదు కాని సెలబ్రిటీల మీద నోరు పారేసుకుని తలంటు పోయించుకుని దాని ద్వారా పాపులారిటీ తెచ్చుకోవడంలో కమల్ ఆర్ ఖాన్ రూటే వేరు. గతంలో అమీర్ ఖాన్ మీద నోటికి వచ్చినట్టు మాటలు తూలి ఏకంగా తన ట్విట్టర్ ఎకౌంటు ని బ్యాన్ చేసే దాకా అభిమానుల నుంచి నిరసన ఎదుర్కున్న ఇతగాడు ఇప్పుడు ప్రభాస్ సాహో మీద పడ్డాడు.టి సిరీస్ సంస్థ నిర్మాణ భాగస్వామ్యంలో ఉన్న కారణంగా సాహో ఈ ఏడాదిలోనే అతి పెద్ద డిజాస్టర్ గా మిగలబోతోందని జోస్యం చెప్పాడు. ఇంకా షూటింగ్ కూడా పూర్తి కాని సినిమాకు అందులోనూ టీజర్ కూడా రాని సందర్భంలో ఇలాంటి అవాకులు చెవాకులు పేలడం పట్ల ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు ఇతర హీరోల అభిమానులు కూడా కమల్ ఖాన్ మీద ఫైర్ అవుతున్నారు.ఇతగాడు కావాలని చేస్తాడని తెలిసినా సోషల్ మీడియాలో ఇవి వైరల్ అవుతుండటంతో కమల్ ఖాన్ టార్గెట్ నేరవేరుతోంది.

గతంలో పవన్ కళ్యాణ్ ని బాహుబలిని చిరంజీవిని ఇలా ఎవరిని వదలకుండా నెగటివ్ కామెంట్స్ చేసిన ఘనుడు ఇతగాడు. ఇప్పుడు ప్రభాస్ సినిమా మీద కడుపు మంటో లేక టి సిరీస్ మీద అక్కసో తెలియదు కాని దీని పుణ్యమా అని మరోసారి వార్తల్లోకి వచ్చేశాడు. దీని మీద డార్లింగ్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొసమెరుపు ఏంటంటే సాహో బడ్జెట్ 250 కోట్లుగా పేర్కొన్న కమల్ ఖాన్ కొత్త పోస్టర్ ని షేర్ చేస్తూ మరీ ఇలా పేలడం గమనార్హం