వీడియో : 67 ఏళ్ల వయసులోనూ తగ్గేదేలే

Wed Jun 29 2022 16:00:01 GMT+0530 (IST)

Kamal Haasan Pushup Viral Video

యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా సుదీర్ఘ కాలంగా ఇండస్ట్రీలో ఉన్నాడు. ఆయన చూడని హిట్ లు.. ఆయన చూడని అవార్డులు లేవు. అయితే గత పది సంవత్సరాల నుండి కమర్షియల్ గా ఆయన సినిమాలు ఆడటం లేదు.ఇలాంటి సమయంలో వచ్చిన విక్రమ్ సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. దాదాపుగా 400 కోట్ల రూపాయల వసూళ్లను విక్రమ్ సాధించినట్లుగా సమాచారం అందుతోంది.

విడుదల అయిన అన్ని భాషల్లో కూడా విక్రమ్ భారీ బ్లాక్ బస్టర్ గా నిలవడంతో కమల్ హాసన్ చాలా హ్యాపీగా ఉన్నాడు. కమల్ ఈ సినిమాను స్వయంగా నిర్మించిన విషయం తెల్సిందే. విక్రమ్ తో వచ్చిన లాభాలతో తన అప్పులను తీర్చేసుకున్నట్లుగా కమల్ హాసన్ సంతోషంగా ప్రకటించాడు. కమల్ ఈ సంతోషంలో చాలా పనులే చేస్తున్నారు. ఆయన వీడియోలు ఈమద్య సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

తాజాగా దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఒక వీడియోను షేర్ చేశాడు. ఆ వీడియో లో కమల్ హాసన్ పుషప్స్ చేస్తున్నాడు. 67 ఏళ్ల వయసులో సాదారణం ఎక్కువ సమయం నడిచేందుకు ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటిది కమల్ హాసన్ ఏకంగా 28 పుషప్స్ చేశారు అంటూ దర్శకుడు లోకేష్ కనగరాజ్ పేర్కొన్నాడు. ఆయన ఎంతో మందికి ఆదర్శం అన్నట్లుగా లోకేష్ పేర్కొన్నాడు.

నిజంగానే ఏడు పదుల వయసుకు చేరువ అయిన కమల్ హాసన్ ఇలా వర్కౌట్స్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఆయన ఫిజిక్ మరియు ఆయన ఆరోగ్యం అందరికి కూడా మిరాకిల్ అనడంలో సందేహం లేదు. అందుకే లోకేష్ కనగరాజ్ ఈ వీడియో షేర్ చేస్తూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.

కమల్ హాసన్ చాలా సంవత్సరాల తర్వాత విక్రమ్ సినిమా తో కమర్షియల్ గా సక్సెస్ లు దక్కించుకున్న నేపథ్యంలో ఆయన అభిమానులు కూడా చాలా ఆనందం గా ఉన్నారు. కమల్ తదుపరి సినిమా కోసం ఎదురు చూస్తున్న వారికి ఇలా వైరల్ వీడియోలు మరింతగా కమల్ తదుపరి సినిమాలపై అంచనాలు పెంచుతున్నాయి.