Begin typing your search above and press return to search.
ఓటీటీ గురించి 10 ఏళ్ల క్రితమే చెప్పా..కానీ పరిశ్రమ విబేధించింది! కమల్ హాసన్
By: Tupaki Desk | 28 May 2023 3:00 PMవిశ్వనటుడు కమల్ హాసన్ అసాధారణ ప్రతిభావంతుడు. 20 ఏళ్ల భవిష్యత్ ని ముందే ఊహించగల గొప్ప మేధావి. అందుకే డీటీహెచ్ ( డైరెక్ట్ టూ హోమ్ సినిమా) తీసుకురావాలని తొలిసారి ఆలోచన చేసింది.. దాన్ని ప్రతి పాదించింది అతనే. పరోక్షంగా చెప్పాలంటే ఇప్పుడు ఓటీటీ చేస్తున్న పనినే కొన్నేళ్ల క్రితం కమల్ అలా చెప్పుకొచ్చారు. డిజిటల్ యుగంలో విప్లవాత్మకమైన మార్పులొస్తాయని కమల్ దశాబ్ధ క్రితమే చెప్పారు.
ఆయన చెప్పినట్లే జరిగింది. టెక్నికల్ గా అసాధారణమైన పరిజ్ఞానం కలిగి వ్యక్తి. అందుకే టెక్నికల్ నేపథ్యం గల సినిమాలు చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఈ విషయాన్ని సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా అన్నారు. `రోబో` లాంటి సినిమా రజనీ వద్దకు వెళ్తే..ఇలాంటివి నాకు ఆసక్తి ఉండదు. కమల్ అయితే బాగా చేస్తాడని శంకర్ నే ఒప్పించాలని ప్రయత్నించారు. తాజాగా ఐఐఎఫ్‌ఎ 2023 అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా కమల్ హాసన్ ఓటీటీ విప్లవాన్ని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
`ఓటీటీ విప్లవాన్ని అందరికంటే ముందే చూసాను. మనం అందులోకి రావాలని నేను అందరికీ చెప్పాను. కానీ పరిశ్రమ నాతో విభేదించింది. ఇప్పుడు నేను ఏమి చెప్పాలనుకుంటున్నానో అందరికీ అర్థమైంది. ఇండియన్ సినిమా ఇప్పుడు పాన్ వరల్డ్ లో గుర్తింపు దక్కించుకుంది. నేను సినిమా బఫ్‌ని. నేను ఏది చేయాలనుకుంటే అదే చేస్తాను. కొన్నిసార్లు ఇతర విషయాల పట్ల జోక్యం చేసుకుంటాను.
కానీ అలాంటి సినిమాల్లో నేను నటించను. నిర్మిస్తాను. అలాంటి సినిమాలు కొన్ని ఉన్నాయి. కొత్త టెక్నాలజీలు- విభిన్నమైన కథాకథనాల వల్ల సినిమా రూపురేఖలు మారిపోతున్నాయి. మనం అందుకు ధీటుగా తయారవ్వాలి. మీకు సాహిత్యంలో MA డిగ్రీ ఉన్నా అది మిమ్మల్ని మంచి స్క్రీన్ రైటర్‌గా మార్చదు. కేవలం మిమ్మల్ని డిగ్రీ హోల్డర్‌గానే చేస్తుంది. షేక్స్పియర్ స్క్రీన్ రైటింగ్లో కొన్ని వర్క్‌షాప్‌లు తీసుకుంటాను. ఇప్పటివరకు జీవించిన గొప్ప కళాకారులలో అతను ఒకడు. అతని ప్రభావం రచయితలందరిపైనా..పరిశ్రమపైనా ఉంటుంది.
వృత్తి పట్ల స్మార్ట్‌గా ఉండటం వల్లనే మేము ఇప్పటివరకు మనుగడ సాగించగలిగాము. ఒక జర్నలిస్ట్ శిక్షణ కోసం మరొక జర్నలిస్ట్ వద్దకు వెళ్తాడు. నటులు -దర్శకులు కూడా అలా ఉండాలి. అప్పుడే పనిలో ఆరితేరుతాం. ప్రపంచంలోనే అత్యధికంగా సినిమాలను నిర్మిస్తున్న దేశం మనది. ఇంకా తగినంత శిక్షణా కేంద్రాలు లేవు. క్రికెట్ నేర్చుకోవడానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి. మరి సినిమా శిక్షణ సంబంధించి ఎలాంటి వెసులు బాటులు మన దగ్గర ఉన్నాయి? దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు.