Begin typing your search above and press return to search.

కేర‌ళ స్టోరీ పై క‌మ‌ల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

By:  Tupaki Desk   |   28 May 2023 2:13 PM
కేర‌ళ స్టోరీ పై క‌మ‌ల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
X
ఇటీవ‌ల రిలీజ్ అయిన 'ది కేర‌ళ స్టోరీ' ఎంత పెద్ద విజ‌యం సాధించిందో చెప్పాల్సిన ప‌నిలేదు. బాక్సాఫీస్ వ‌ద్ద 200 కోట్ల‌ కు పైగా వ‌సూళ్ల‌ని సాధించింది. ఇప్ప‌టికీ అదే దూకుడు కొన‌సాగిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రేక్ష‌కులు సినిమాకి బ్రహ్మ‌ర‌ధం ప‌డుతున్నారు. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు సినిమా క‌నెక్ట్ అవుతుంది. రిలీజ్ ఆల‌స్య‌మైనా? మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఇక సినిమాని కొన్ని రాష్ట్రాలు బ్యాన్ చేసిన సంగ‌తి తెలిసిందే.

ఇలాంటి సినిమాలు రిలీజ్ చేస్తే యువ‌త చెడిత‌పోతుంద‌ని కొన్ని రాజ‌కీయ పార్టీలు యాగీ చేసాయి. అయితే మ‌రికొన్ని రాష్ట్రాలు మాత్రం రాయితీ ఇచ్చి మ‌రీ రిలీజ్ చేయిస్తున్నాయి. ఇక ఈ సినిమా ని సంచ‌నాల రాంగోపాల్ వ‌ర్మ ఆకాశానికి ఎత్తేసిన సంగ‌తి తెలిసిందే. అస‌లైన పాన్ ఇండియా సినిమా అంటే ఇది అని త‌న‌దైన శైలిలో ట్వీట్ చేసారు. ఈ ట్వీట్ సినిమా పై మ‌రింత అంచ‌నాలు పెంచేసింది.

ఇంకా చాలా మంది సినిమా గురించి పాజిటివ్ గా స్పందించారు. అయితే తాజాగా ఇదే సినిమాపై విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు. నేను ఎప్పుడూ ఒకే మాట చెబుతాను. నాకు ప్ర‌చార చిత్రాలు న‌చ్చ‌వు. అలాంటి వాటికి నేను పూర్తి వ్య‌తిరేకిని. సినిమా టైటిల్ కింద నిజ‌మైన క‌థ అని రాయ‌గానే స‌రిపోదు. అలా రాసినంత మాత్రాన అది నిజంగా జ‌రిగిన క‌థ అవ్వ‌దు' అని అన్నారు.

దీంతో క‌మ‌ల్ వ్యాఖ్య‌లు నెట్టింట వైర‌ల్ గా మారాయి. హిట్ సినిమా గురించి ఆయ‌న ఇలా మాట్లాడారేంటి? అంద‌రికీ న‌చ్చిన‌ సినిమా ఆయ‌న‌కి న‌చ్చ‌దా? అంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. ఆయ‌నే కాదు ఓ కొంత మంది ప్రేక్ష‌కులు సినిమా పై నెగిటివ్ ఫీడ్ బ్యాక్ ఇచ్చారు.