'బింబిసార' తెచ్చిన క్రేజ్ భలే వర్కవుట్ అయిందే!

Tue Jan 24 2023 15:16:50 GMT+0530 (India Standard Time)

Kalyan Ram movie in profits before the release!

కొన్ని సినిమాలు రిలీజ్ వరకు ప్రొడ్యూసర్స్ కు లాభాల్ని అందించవు. కానీ కొన్ని మాత్రం రిలీజ్ కు ముందే టేబుల్ ప్రాఫిట్ ని అందించి వార్తల్లో నిలుస్తుంటాయి. ఇప్పుడు ఇదే తరహాలో వార్తల్లో నిలుస్తోంది నందమూరి కల్యాణ్ రామ్ నటించిన 'అమిగోస్' మూవీ. వివరాల్లోకి వెళితే..రెండేళ్ల తరువాత నందమూరి కల్యాణ్ రామ్ 'బింబిసార' బ్లాక్ బస్టర్ ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీతో వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న ఇండస్ట్రీకి భారీ విజయాన్ని అందించి సక్సెస్ ట్రాక్ లోకి వచ్చేసిన కల్యాణ్ రామ్ అదే ఊపుతో సరికొత్త కథతో చేస్తున్న మూవీ 'అమిగోస్'.మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ తో రాజేంద్ర రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కెరీర్ ప్రారంభం నుంచి కొత్త దర్శకులకు అవకాశాలు ఇస్తూ సరికొత్త ప్రయోగాత్మక  సినిమాలకు శ్రీకారం చుడుతున్న కల్యాణ్ రామ్ సరికొత్త కథ నేపత్యంలో రూపొందుతున్న మూవీ కాబట్టే 'అమిగోస్'కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. ఇందులో మూడు భిన్నమైన పాత్రల్లో ట్రిపుల్ రోల్ లలో కనిపిస్తున్న కల్యాణ్ రామ్ ఈ మూవీతో 'బింబిసార' తరువాత మరో హిట్ ని తన ఖాతాలో వేసుకునేలా కనిపిస్తున్నాడు.

రీసెంట్ గా విడుదల చేసిన టీజర్ నుంచి ఈ మూవీపై అంచనాలు ఏర్పడ్డాయి. ట్రిపుల్ రోల్ లో కనిపిస్తున్న కల్యాణ్ రామ్ ఒక్కో క్యారెక్టర్ కోసం ఒక్కో మేకోవర్ తో కనిపిస్తుండంతో ట్రేడ్ వర్గాల్లోనూ ఈ మూవీ కోసం భారీ పోటీ ఏర్పడినట్టుగా చెబుతున్నారు.

ప్రీ రిలీజ్ బిజినెస్ ఇప్పటికే పూర్తయిపోవడమే కాకుండా మైత్రీ మూవీ మేకర్స్ ని అప్పుడే లాభాల్లోకి చేర్చి నట్టుగా తెలుస్తోంది. 'బింబిసార'లో కల్యాణ్ రామ్ ద్విపాత్రాభినయం చేసిన విషయం తెలిసిందే.

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ మూవీ నాన్ థియేట్రికల్ హక్కులతో కలిపి ముందే టేబుల్ ప్రాఫిట్ ని మేకర్స్ సొంతం చేసుకున్నారట. అంతే కాకుండా 'అమిగోస్' థియేట్రికల్ హక్కుల్ని భారీ మొత్తానికే ఇచ్చేసి నట్టుగా చెబుతున్నారు. 'బింబిసార' హిట్ కారణంగానే ఈ మూవీకి ఈ స్థాయిలో బిజినెస్ జరిగినట్టుగా ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది. అషికా రంగనాథన్ హీరోయిన్ గా పరిచయం అవుతున్నఈ మూవీని ఫిబ్రవరి 10న భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు.  

ముగ్గరు ఒకే రకంగా వున్న వ్యక్తుల నేపథ్యంలో సాగే చిత్రమైన కథగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. కల్యాణ్ రామ్ కెరీర్ లోనే తొలి సారి ట్రిపుల్ రోల్ లో నటిస్తున్న ఈ మూవీకి జిబ్రాన్ సంగీతం అందిస్తుండగా సౌందరరాజన్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.