కళ్యాణ్ రామ్ డేర్ 'డెవిల్' లుక్.. అదిరిపోయిందిగా..!

Wed Mar 22 2023 12:14:04 GMT+0530 (India Standard Time)

Kalyan Ram's Dare 'Devil' Look.. Excited..!

నైస్ టు మీట్ యు లండన్ లైఫ్ బాబు బాగా బిజీ సినిమాలు డైరెక్ట్ చేసిన నవీన్ మేడారం ఆహా లో వచ్చిన సిన్ అనే వెబ్ సీరీస్ ను కూడా డైరెక్ట్ చేశారు. ప్రస్తుతం ఈ డైరెక్టర్ కళ్యాణ్ రామ్ హీరోగా వస్తున్న డెవిల్ సినిమాను చేస్తున్నారు.అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ లో అభిషేక్ నామ నిర్మిస్తున్న ఈ సినిమా పీరియాడికల్ మూవీగా వస్తుంది. భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ లుక్ డిఫరెంట్ గా ఉండబోతుంది. సైలెంట్ గా సినిమా షూటింగ్ జరుపుకుంటున్న డెవిల్ నుంచి ఉగాది సందర్భంగా ఒక క్రేజీ పోస్టర్ వదిలారు.

పోస్టర్ లో కళ్యాణ్ రామ్ లుక్ మాత్రం అదిరిపోయిందని చెప్పొచ్చు. కింద పంచె పైన కోటు.. ఒక చేత్తో గన్ మరో చేత్తో కత్తి కళ్యాణ్ రామ్ ఇంటెన్స్ లుక్ నందమూరి ఫ్యాన్స్ ని మాత్రమే కాదు సగటు సినీ ప్రేక్షకుడికి కూడా సినిమాపై ఆసక్తి కలిగేలా చేస్తున్నాయి.

ఇక పోస్టర్ బ్యాక్ డ్రాప్ లో ఒక పెద్ద షిప్ కూడా కనిపిస్తుంది. మొత్తానికి కళ్యాణ్ రామ్ ఈసారి కూడా ఒక భారీ ప్రయోగంతోనే వస్తున్నారని తెలుస్తుంది. బింబిసార తో హిట్ అందుకున్న కళ్యాణ్ రామ్ రీసెంట్ గా అమిగోస్ అంటూ వచ్చి నిరాశపరిచారు.

డెవిల్ సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని అంటున్నారు చిత్ర యూనిట్. అంతేకాదు ఈ సినిమా నిర్మాత అభిషేక్ నామా ఈ సినిమా పాయింట్ ని ఇంతవరకు ఎవరు టచ్ చేయలేదని చెబుతున్నారు. డిఫరెంట్ కథలతో తెలుగు ఆడియన్స్ కు ఒక కొత్త సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వాలని చూస్తున్న కళ్యాణ్ రామ్ డెవిల్ తో సూపర్ హిట్ అందుకోవాలని కోరుతున్నారు.

డెవిల్ సినిమాలో హీరోయిన్ ఎవరన్నది ఇంతవరకు డిక్లేర్ చేయలేదు. శ్రీకాంత్ విస్సా అందించిన ఈ సినిమా బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ నేపథ్యంతో పీరియాడికల్ మూవీగా వస్తుంది. ఈ సినిమాతో కళ్యాణ్ రామ్ మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.