కళ్యాణ్ రామ్ కాస్ట్లీ సాంగ్

Sat Mar 18 2023 18:59:06 GMT+0530 (India Standard Time)

Kalyan Ram Costly Song For Devil Movie

నందమూరి కళ్యాణ్ రామ్ ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ కథలతో సినిమాలు చేసుకుంటూ ముందుకి వెళ్తున్న సంగతి తెలిసిందే. బింబిసారా మూవీ తర్వాత కళ్యాణ్ రామ్ కథల ఎంపికలో కూడా యూనివర్శల్ అప్పీల్ ఉండే విధంగా చూసుకుంటున్నారు. ఇదిలా ఉంటే రీసెంట్ గా అమిగోస్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన కళ్యాణ్ రామ్ డిజాస్టర్ ని ఖాతాలో వేసుకున్నారు.ఇదిలా ఉంటే నవీన్ మేడారం దర్శకత్వంలో ఎప్పుడో డెవిల్ అనే ప్రాజెక్ట్ ని ఎనౌన్స్ చేశారు. పాన్ ఇండియా రేంజ్ లో ఈ మూవీ తెరకెక్కుతుంది అని ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ తో అనౌన్స్ చేశారు. ఆ తరువాత ఇప్పటి వరకు డెవిల్ మూవీ గురించి ఎలాంటి అప్డేట్ లేదు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుందని తెలుస్తుంది. కళ్యాణ్ రామ్ కెరియర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ పీరియాడికల్ జోనర్ లో తెరకెక్కుతుంది.

ఈ సినిమాలో బ్రిటిష్ గవర్నమెంట్ లో పని చేసి ఇండియన్ స్పైగా కళ్యాణ్ రామ్ కనిపిస్తాడని తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబందించిన ఒక సాంగ్ ని రీసెంట్ గా అన్నపూర్ణ స్టూడియోస్ లో చిత్రీకరించినట్లు తెలుస్తుంది.

ఏకంగా ఈ సాంగ్ కోసం మూడు కోట్లు ఖర్చు చేసినట్లు టాక్. బాలీవుడ్ బ్యూటీ ఎల్నాజ్ నురూజిని కనిపించబోతుంది అని తెలుస్తుంది. జర్మన్ యాక్టర్ కమ్ మోడల్ అయిన ఈమె హిందీ సినిమాలలో ఐటెం సాంగ్స్ తో రాణిస్తుంది.

ఈమెని ఇప్పుడు కళ్యాణ్ రామ్ డెవిల్ మూవీలో ప్రత్యేక గీతంలో నర్తించినట్లు తెలుస్తుంది. ఇక బృందా మాస్టర్ ఈ సాంగ్ కొరియోగ్రఫి చేయగా హర్షవర్ధన్ రామేశ్వరాన్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు.

ఇక శ్రీకాంత్ విస్సా ఈ మూవీకి కథ మాటలు అందిస్తూ ఉండటం విశేషం. ఈ సినిమాని అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ నామా భారీ బడ్జెట్ తో నిర్మిస్తూ ఉండటం విశేషం. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాలో బ్రిటిష్ ఆఫీసర్ గా నటించిన ఎడ్వర్డ్ సోనాన్ బ్లిక్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.