నాగ్ సినిమాలో కాజల్ ఊహించని బోల్డ్ రోల్..??

Fri Jun 18 2021 16:00:01 GMT+0530 (IST)

Kajal unexpected bold role in Nag movie

దక్షిణాది స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్.. పెళ్లికి ముందు కంటే పెళ్లి తర్వాతే సినిమాలు స్పీడప్ చేసేసింది. ప్రస్తుతం కాజల్ చేతిలో భారీ సినిమాలే ఉన్నాయి. ఈ భామ మొదటిసారి టాలీవుడ్ కింగ్ నాగార్జున సరసన నటిస్తోంది. కింగ్ నాగ్ ప్రధానపాత్రలో `గరుడవేగ` ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ యాక్షన్ థ్రిల్లర్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. కాగా ఈ సినిమాలో కాజల్ కీలకపాత్రలో నటిస్తోంది. అయితే ఈ సినిమాలో కాజల్ ఇంతవరకు చూడని న్యూ లుక్కులో కనిపించనుందని ఆల్రెడీ డైరెక్టర్ చెప్పాడు.అయితే ఎలాంటి క్యారెక్టర్ అనేది మాత్రం క్లారిటీ లేదు. కానీ కాజల్ పాత్రకు సంబంధించి ఈ యాక్షన్ మూవీలో `రా` ఏజెంట్ గా కనిపించనుందని టాక్ నడుస్తుంది. అలాగే కాజల్ ఈసారి నెవర్ బిఫోర్ లుక్‌లో డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ తో అలరించనుందని తెలుస్తుంది. అందుకు తగ్గట్టుగానే తాజా కథనాలు కాజల్ క్యారెక్టర్ పై ఆసక్తి రేపుతున్నాయి. తన పాత్ర కోసం ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంటుందట కాజల్. అందులో భాగంగానే కాజల్ మార్షల్ ఆర్ట్స్ - రైఫిల్ షూటింగ్ లాంటివి కూడా నేర్చుకుంటుందట. ఇంతకీ మరి ఇవన్నీ కలిసి ఏం చేయబోతుంది.. అంటే మాత్రం కాజల్ ఫస్ట్ టైమ్ బోల్డ్ రోల్ చేయనుందని టాక్.

ఈ సినిమాలో స్పై క్యారెక్టర్ అయినా ఓ వేశ్యగా కూడా నటిస్తున్నట్లు సినీవర్గాలు చెబుతున్నాయి. ఇందులో ఎంతవరకు నిజముందో గాని కాజల్ వేశ్య రోల్ అనేసరికి ఫ్యాన్స్ లో ఆత్రం పెరిగిపోయింది. ఎందుకంటే ఇప్పటివరకు కాజల్ ను అలాంటి బోల్డ్ రోల్ లో చూడలేదని అంటున్నారు. చూడాలి మరి ప్రాస్టిట్యూట్ యాంగిల్ లో కాజల్ ఎలా ఆకట్టుకుంటుందో.. ఇదే కాకుండా కాజల్ తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన ఆచార్య సినిమాలో నటిస్తోంది. కొరటాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం చివరి దశలో ఉంది. అలాగే కాజల్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఇండియన్-2 సినిమాలో కూడా నటిస్తోంది. ఆ సినిమా ప్రస్తుతం వివాదంలో నిలిచింది.