Begin typing your search above and press return to search.

హారర్ వెబ్ సిరీస్ లో కాజల్.. కంఫర్మ్ చేసిన డైరెక్టర్...!

By:  Tupaki Desk   |   6 Aug 2020 8:10 AM GMT
హారర్ వెబ్ సిరీస్ లో కాజల్.. కంఫర్మ్ చేసిన డైరెక్టర్...!
X
డిజిటల్ వరల్డ్ లో రాబోయే రోజుల్లో వెబ్ కంటెంట్ దే హవా కాబోతోందని భావిస్తున్న నటీనటులు దర్శక నిర్మాతలు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది ఒరిజినల్ మూవీస్ మరియు వెబ్ సిరీస్ నిర్మాణంలో పాలుపంచుకున్నారు. ఇక స్టార్ హీరో హీరోయిన్లు సైతం వెబ్ సిరీస్ లలో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. బాలీవుడ్ లో ఇప్పటికే స్టార్స్ వెబ్ సిరీస్ లలో నటిస్తున్నప్పటికే సౌత్ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే ఈ ట్రెండ్ స్టార్ట్ అయింది. ఈ క్రమంలో శ్రీకాంత్, సందీప్ కిషన్, నవదీప్, సత్య దేవ్, ప్రియదర్శి, మంచు లక్ష్మీ, హెబ్బా పటేల్, నిహారిక వంటి వారు వెబ్ సిరీస్ లలో నటించారు. స్టార్ హీరోయిన్స్ సమంత - ప్రియమణి కూడా 'ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ లో నటించారు. ఇప్పుడు కాజల్ అగర్వాల్ కూడా వీరి బాటలోనే నడవనుంది.

కాగా స్టార్ హీరోయిన్స్ లో ఒకరైన కాజల్ అగర్వాల్ కెరీర్ స్టార్ట్ చేసి పన్నెండేళ్లయినా ఇప్పటికీ అదే జోరు చూపిస్తోంది. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి - కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'ఆచార్య' సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అలానే మంచు విష్ణు 'మోసగాళ్లు' మూవీలో కూడా కాజల్ ప్రధాన పాత్ర పోషిస్తోంది. వీటితో పాటు తమిళంలో కమల్ హాసన్ - శంకర్ కాంబినేషన్ లో వస్తున్న 'ఇండియన్ 2' మరియు 'హే సినామికా' సినిమాలలో కూడా నటిస్తోంది. ఈ క్రమంలో కాజల్ అగర్వాల్ డైరెక్టర్ వెంకట్ ప్రభు తెరకెక్కిస్తోన్న 'లైవ్ టెలికాస్ట్' అనే వెబ్ సిరీస్‌ లోనూ కాజల్ అగర్వాల్ కనిపించనుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

ఇప్పుడు తాజాగా డైరెక్టర్ వెంకట్ ప్రభు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కాజల్ అగర్వాల్ తో ఓ హార్రర్ వెబ్ సిరీస్ రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. ఇక వైభవ్ - ఆనంది ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ వెబ్ సిరీస్ 7 ఎపిసోడ్స్ గా ప్రసారం అవుతుందని.. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుందని.. త్వరలోనే ఆఫీసియల్ గా అనౌన్స్ చేస్తారని చెప్పుకొచ్చాడు వెంకట్ ప్రభు. మొత్తం మీద సిల్వర్ స్క్రీన్ పై సత్తా చాటుతున్న కాజల్ వెబ్ వరల్డ్ లో కూడా హవా చూపిస్తుందేమో చూడాలి.