చందమామ ఇంత బోల్డ్ గానా?

Tue May 21 2019 09:47:50 GMT+0530 (IST)

Kajal agarwal Latest Photo Shoot

స్టన్నింగ్ .. కిల్లింగ్.. మైండ్ బ్లోయింగ్.. ! ఇంకా ఏవైనా కొత్త పదాల్ని వెతకాలేమో ఈ అందాన్ని వర్ణించేందుకు. చందమామ కిల్లింగ్ .. కుర్రకారు గుండెల్ని చిదిమేస్తోంది. ఇంత హాట్ గా మునుపెన్నడూ ఇలా చెలరేగిపోలేదు కాజల్. తెలుగు సినీపరిశ్రమలో దశాబ్ధం పైగానే కెరీర్ ని సాగించిన కాజల్ ఇంత బోల్డ్ లుక్ లో కనిపించనే లేదు. మునుపటితో పోలిస్తే యాటిట్యూడ్ పరంగా చాలానే మారినట్టే కనిపిస్తోంది. ప్రస్తుత యువతరానికి ఏమాత్రం తీసిపోని విధంగా సామాజిక మాధ్యమాల వేదికగా తనని తాను ప్రమోట్ చేసుకుంటోంది. రెగ్యులర్ ఫోటోషూట్లతో వేడెక్కించే ఫోటోల్ని ఫ్యాన్స్ కి షేర్ చేస్తూ వెబ్ లో వైరల్ అయిపోతోంది. ముఖ్యంగా ఇన్ స్టాలో ఇటీవల కాజల్ మరింత వేడి పెంచేయడం యువతరంలో చర్చకొచ్చింది.ప్రస్తుతం కాజల్ నటించిన `సీత` థియేటర్లలోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సీత ప్రమోషన్స్ లో బిజీగా ఉంటూనే మరోవైపు రెగ్యులర్ ఫోటోషూట్లను అభిమానులకు షేర్ చేస్తూ వేడెక్కిస్తోంది. తాజాగా రెడ్ హాట్ లుక్ ని ఇన్ స్టాలో షేర్ చేసింది. ఈ ఫోటో వెబ్ లోకి ఇలా వచ్చిందో లేదో అలా జోరుగా వైరల్ అయిపోతోంది. పింక్ బ్యాక్ గ్రౌండ్ .. పింక్ - రెడ్ కాంబో స్ట్రాప్ లెస్ డ్రెస్ లో కాజల్ లుక్ అదిరిపోయింది. ముఖ్యంగా అసలు కాజల్ ఒంటిపై నూలు పోగైనా లేదే! అన్నంత ఇంప్రెస్సివ్ గా ఆ ఫోటోగ్రఫీ లో క్రియేటివ్ స్టైల్ ఆకట్టుకుంది. చందమామలో ఇంతందం దాగి ఉంది. అంత థై సౌందర్యం ద్విగుణీకృతం అయ్యి ఉంది.. అని ఈ ఫోటో చెప్పకనే చెబుతోంది.

తాను అనుకున్నది సాధించుకునేందుకు ఎంతకైనా తెగించే డేరింగ్ బిజినెస్ ఉమెన్ సీత అంటూ కాజల్ ఇదివరకూ ప్రచారంలో చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. అలాగే తన తదుపరి చిత్రం భారతీయుడు 2 జూన్ నుంచి సెట్స్ కెళుతుందని వెల్లడించింది. క్వీన్ రీమేక్ ప్యారిస్ ప్యారిస్ రిలీజ్ బరిలో ఉంది. వీటితో పాటు మరో కొత్త ప్రాజెక్టు గురించి రెండ్రోజుల్లో రివీల్ చేయనుంది.