Begin typing your search above and press return to search.

విజయ్ తో మళ్లీ కాజల్ ఫిక్స్ అయినట్లేనా..?

By:  Tupaki Desk   |   30 March 2020 10:30 PM GMT
విజయ్ తో మళ్లీ కాజల్ ఫిక్స్ అయినట్లేనా..?
X
తుపాకీ. ఈ సినిమా పేరు వింటేనే ఇళయదళపతి విజయ్-కాజల్ అగర్వాల్ జంట గుర్తొస్తుంది. ఎందుకంటే ఆ సినిమా సృష్టించిన ప్రభంజనం అలాంటిది మరి. ఆ సినిమాలో విజయ్-కాజల్ ల లవ్ ట్రాక్ - డాన్స్ - అన్నింటికీ మించి మంచి మెసేజ్ ఉన్న సినిమా తుపాకీ. ఆ తర్వాత విజయ్-కాజల్ కలిసి జిల్లా సినిమాలో కన్పించారు. ఇక ఆ సినిమా కూడా హిట్ అవ్వడంతో వీరిద్దరికి హిట్ పెయిర్ అని ముద్ర పడిపోయింది. అంతటితో ఆగకుండా విజయ్-కాజల్ పెయిర్ మళ్లీ మనకు మెర్సెల్ సినిమాలో కన్పించింది. అందులో వారిద్దరి కెమిస్ట్రీకి ప్రేక్షకులు నోరెళ్ళబెట్టి చూసారు. అంతలా కుదిరింది వారి జంట.

అయితే విజయ్, సెన్సేషనల్ డైరెక్టర్ మురుగదాస్ ల కాంబినేషన్ కూడా స్పెషల్ అనే చెప్పాలి. వారిద్దరిలో కాంబినేషన్లో వచ్చిన తుపాకీ, సర్కార్ సినిమాలు ఎంతటి భారీ విజయాలను అందుకున్నాయో అందరికి తెలిసిందే. అయితే తాజాగా మురుగదాస్ చాలా కాలం నుండి తుపాకీ సినిమాకి సీక్వెల్ తీసే ప్లాన్ లో ఉన్నట్లు సమాచారం. తుపాకీ-2 కథ కూడా విజయ్ కి వినిపించాడట. మురుగదాస్ చెప్పిన కథకు విజయ్ కూడా పచ్చజెండా ఊపడంతో త్వరలోనే ఈ సినిమాను పట్టాలెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో విజయ్ కి జోడిగా కాజల్ అగర్వాల్ ని తీసుకోవడానికి పరిశీలిస్తున్నట్లు సోషల్ మీడియా కోడై కూస్తోంది. తుపాకీ సీక్వెల్ అంటున్నారు కాబట్టి అందులో ఉన్న కాజల్ నే హీరోయిన్ గా తీసుకుంటే బాగుంటుంది.. అని సినీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. చూడాలి మరి ఏం జరగనుందో.. చిత్రయూనిట్ నుండి ఎలాంటి సమాచారం అందుతుందో..!