సీత రాకకు కొత్త ముహూర్తం ఖరారు!

Mon Apr 22 2019 16:14:04 GMT+0530 (IST)

Kajal Sita Movie Release Date Lock

సీనియర్ దర్శకుడు తేజ డైరెక్షన్లో బెల్లకొండ శ్రీనివాస్.. కాజల్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం 'సీత'.  ఈ సినిమా రిలీజ్ డేట్ పై గత కొన్నిరోజులుగా అనుమానాలు రేకెత్తుతున్న సంగతి తెలిసిందే.  నిజానికి ఈ వారంలోనే సినిమాను రిలీజ్ చేయాలని మొదట్లో నిర్మాతలు ప్లాన్ చేశారు కానీ ఇప్పుడు వచ్చే నెలకు మార్చారు.మే 24 న 'సీత' ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారని సమాచారం. మే 9 న మహేష్ బాబు 'మహర్షి' రిలీజ్ అవుతోంది.  మహేష్ సినిమా విడుదల అయిన రెండు వారాల తర్వాత బెల్లంకొండ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి మంచి డేటే. పైగా పోటీలో వేరే సినిమాలు లేవు. మే 31 న రిలీజ్ కావాల్సి ఉన్న 'డియర్ కామ్రేడ్' కూడా జూన్ రెండోవారానికి వాయిదా వేస్తున్నారని ఇప్పటికే  వార్తలు వచ్చాయి కాబట్టి ఇతర సినిమాల కాంపిటీషన్ తో పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు.

ఇదిలా ఉంటే 'సీత' పై పెద్దగా హైప్ లేదు. దీంతో ఈ నెలరోజులు స్ట్రాంగ్ ప్రమోషన్స్ చేసి సినిమాపై క్రేజ్ పెంచాలని నిర్మాతలు అలోచిస్తున్నారని ఇన్సైడ్ టాక్.  తేజ లాస్ట్ సినిమా 'నేనే రాజు నేనే మంత్రి' హిట్.  కానీ బెల్లంకొండ శ్రీనివాస్ ఈమధ్య నటించిన సినిమాలు విజయం సాధించలేదు. దీంతో బెల్లంకొండ ఈ సినిమా విజయం పైనే నమ్మకాలు పెట్టుకున్నాడు.  తన రెగ్యులర్ మాస్ హీరో స్టైల్ యాక్టింగ్ కాకుండా భిన్నమైన పాత్ర ట్రై చేయడంతో ప్రేక్షకులు కూడా తనను ఆశీర్వదిస్తారని కాన్ఫిడెంట్ గా ఉన్నాడట. చూద్దాం ఏం జరుగుతుందో!