Begin typing your search above and press return to search.

చంద‌మామ లైఫ్ సెల‌బ్రేష‌న్ వ‌ర్సెస్ కెరీర్

By:  Tupaki Desk   |   20 Jun 2021 5:35 AM GMT
చంద‌మామ లైఫ్ సెల‌బ్రేష‌న్ వ‌ర్సెస్ కెరీర్
X
అందాల చంద‌మామ కాజల్ అగర్వాల్ బిజినెస్ మేన్ ఫ్రెండ్ గౌత‌మ్ కిచ్లుని పెళ్లాడిన సంగతి తెలిసిందే. కొన్నేళ్ల పాటు ర‌హ‌స్య ప్రేమాయ‌ణం అనంత‌రం ఈ జంట వివాహం అభిమానుల‌కు స‌డెన్ స‌ర్ ప్రైజ్ అనే చెప్పాలి. ఇక పెళ్లి త‌ర్వాత కాజ‌ల్ ఫ్యామిలీ లైఫ్ ఎంతో క‌ల‌ర్ ఫుల్ గా సాగుతోంది. మ‌రోవైపు కెరీర్ ప‌రంగానూ కాజ‌ల్ క్ష‌ణం తీరిక లేనంత బిజీగా ఉంది. స్టార్ హీరోయిన్ గా త‌న స్టాటస్ ని కాపాడుకుంటూ వ‌రుస చిత్రాల్లో వెబ్ సిరీస్ ల‌లో న‌టిస్తోంది. లైఫ్ వ‌ర్సెస్ కెరీర్ ప్ర‌స్తుతం ఆస‌క్తిక‌రంగా మారింది.

ఇంత‌లోనే కాజల్ అగర్వాల్ తన 36వ పుట్టినరోజును జరుపుకోగా ఈ వేడుక‌ల్లో గౌత‌మ్ కిచ్లు... కాజ‌ల్ సోద‌రి నిషా అగర్వాల్ సంద‌డి చేశారు. చాక్లెట్ కేక్ సెల‌బ్రేష‌న్ లో ఆ ముగ్గురూ సెల్ఫీలతో సంద‌డి చేశారు.

ప్ర‌స్తుతం కాజ‌ల్ మెగాస్టార్ ఆచార్య స‌హా ప‌లు చిత్రాల్లో న‌టిస్తున్నారు. నాగార్జున క‌థానాయ‌కుడిగా ప్రవీణ సత్తారు తెర‌కెక్కిస్తున్న భారీ చిత్రంలోనూ కాజ‌ల్ న‌టించ‌నుంది. ప్ర‌స్తుతం ఒకేసారి నాలుగు తమిళ చిత్రాలను చేస్తోంది. క‌మ‌ల్ హాస‌న్ స‌ర‌స‌న భార‌తీయుడు 2లోనూ కాజ‌ల్ క‌థానాయిక‌. ఆ సినిమా తాజా షెడ్యూల్ వివాదాల వ‌ల్ల ఇబ్బందుల్లో ప‌డింది. లాక్ డౌన్ అనంత‌రం ఆచార్య షెడ్యూల్ జూలైలో ప్రారంభం కానుంది. ఆచార్య షెడ్యూల్స్ తో పాటు నాగార్జున‌తో సినిమాకి సంబంధించిన షెడ్యూల్ లోనూ కాజ‌ల్ జాయిన్ కావాల్సి ఉంది. మ‌రోవైపు త‌న భ‌ర్త గౌత‌మ్ కిచ్లు బిజినెస్ వ్య‌వ‌హారాల‌కు అవ‌స‌ర‌మైన ప్ర‌మోష‌న్స్ ని కాజ‌ల్ చేస్తున్నారు.