పూలపాన్పు పై స్టార్ బ్యూటీ పరువాల ప్రదర్శన!

Sat Jul 11 2020 15:40:38 GMT+0530 (IST)

Star Beauty Performance

నిజంగా సినీ ఇండస్ట్రీలో కళ్ళతో కుర్రకారు మనసు దోచుకునే సుందరి ఎవరంటే కాజల్ అగర్వాల్ అనే చెప్పాలి. మెగాస్టార్ ఆల్రెడీ కాజల్ గురించి ఖైదీ150 లో పాట పాడిన సంగతి తెలిసిందే. సన్నజాజిలా పుట్టేసిందిరో.. మల్లెతీగలా చుట్టేసిందిరో సుందరి.. అంటూ అదిరిపోయే స్టెప్స్ వేశారు. ఆ పాటలోని పొగడ్తలు అమ్మడి అందానికి తక్కువే అనిపిస్తుంది. అలాంటి అందం అభినయం కాజల్ సొంతం. కాజల్ అందాలను కనులారా వీక్షించడానికి అభిమానులు ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటారు. సోషల్ మీడియాలో మిలియన్ల సంఖ్యలో అభిమానులను కలిగిన కాజల్ ఫ్యాన్స్ కోసం అదిరిపోయే ఫోటోషూట్లతో మురిపిస్తుంది. ఫస్ట్ నుండి కూడా కాజల్ గ్లామర్ గుప్పిస్తూ సినీ ప్రియులను తన గుప్పిట్లో బంధీ చేస్తోంది. ఈ సోయగాల కళ్ల సుందరి సౌత్ ఇండస్ట్రీలతో పాటు నార్త్ ఇండస్ట్రీలో కూడా అవకాశాలను దక్కించుకుంటూ తన హవా కొనసాగిస్తోంది.2007లో లక్ష్మీకళ్యాణం సినిమాతో తెలుగులో అరంగేట్రం చేసిన కాజల్.. చందమామ సినిమాతో తన గ్లామర్ షో ప్రారంభించింది. అప్పటి నుండి ప్రతీ సినిమాలో తన అందాలతో అభిమానులలో వేడిపుట్టిస్తూనే ఉంది. తాజాగా కాజల్ రొమాంటిక్ ఫోటోషూట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైట్ డ్రెస్ లో అమ్మడి మొత్తం పరువాలను కెమెరా ముందు పరిచేస్తుంది. అసలు ఆ ఫోటో చూస్తే కుర్ర ఫ్యాన్స్ మాత్రమే కాదు ఎవరైనా పడిపడి చూస్తారు. ఈ మధ్య అమ్మడు అందాల ప్రదర్శనకు అసలు హద్దులు పెట్టుకోలేదు. అందంగా అలంకరించిన పూల పాన్పు పై హొయలు పోతూ ఊరిస్తోంది కాజల్. ఇక కాజల్ బేబీ ప్రస్తుతం స్టార్ హీరోలతో సినిమాలు చేస్తోంది. మెగాస్టార్ చిరంజీవి సరసన ఆచార్య కమల్ సరసన భారతీయుడు-2 జాన్ అబ్రహం సరసన కొత్త సినిమా చేస్తుంది.