'గోపీచంద్'తో ఫస్ట్ టైం రొమాన్స్ చేయనున్న స్టార్ హీరోయిన్..తనేనట!!

Thu Jul 16 2020 23:00:01 GMT+0530 (IST)

The star heroine who will have a first time work with 'Gopichand' .. herself !!

టాలీవుడ్ ఇండస్ట్రీలోని హ్యాండ్సమ్ హీరోలలో ఒకరు గోపీచంద్. ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో సీటిమార్ అనే సినిమా చేస్తున్నాడు. క్రీడా నేపథ్యంలో సీటిమార్ సినిమా తెరకెక్కుతుంది. అయితే సంపత్ నందితో గోపీచంద్ ఇదివరకే 'గౌతమ్ నంద' అనే సినిమా చేసాడు. ప్రస్తుతం తన తదుపరి సినిమాలు లైన్ లో పెడుతున్నాడు. సీటిమార్ సినిమా తర్వాత తన కెరీర్ కు విలన్ గా 'జయం' మూవీతో పెద్ద బ్రేక్ ఇచ్చిన తేజ డైరెక్షన్ లో 'అలిమేలుమంగ వేంకటరమణ' అనే సినిమాను చేసేందుకు గోపి రెడీగా ఉన్నాడు. తేజ దర్శకత్వంలో గోపి హీరోగా చేయడం ఇదే మొదటిసారి. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో తేజతో సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం.ఇక ఈ సినిమాలో వేంకటరమణ క్యారెక్టర్ ను గోపీ చేయనుండగా -అలిమేలుమంగ పాత్రను ఎవరు చేస్తారనేది ఇంతవరకు ఇండస్ట్రీలో ఆసక్తికరమైన ప్రశ్న. అయితే అలిమేలుమంగ క్యారెక్టర్ కు సంబంధించి ఫిల్మ్ నగర్ లో ఇద్దరి పేర్లు జోరుగా వినిపించాయి. వాస్తవానికి డైరెక్టర్ తేజ ఫస్ట్ కాజల్ నే తీసుకుందామని భావించినట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. అలివేలు పాత్ర కోసం కాజల్ గానీ - అనుష్క గానీ కనిపిస్తారని ప్రచారం జరిగింది. కాజల్ ఈ సినిమాలో నటించడానికి ముందుకొచ్చినా తేజ మరో ఆప్షన్ కోసం ఇన్నిరోజులు వెతికాడు. అనుష్క పేరు అయితే రూమరేనని తేలింది. అంతేగాక తేజ దృష్టిలో ఇద్దరు యంగ్ హీరోయిన్లు.. కీర్తి సురేష్ - సాయి పల్లవి కూడా ఉండేనట.

అయితే సాయి పల్లవి డేట్లు ఇప్పుడు దొరకడం అంత ఈజీ కాదు. ఎందుకంటే తన చేతిలో `విరాట పర్వం` సినిమా ఉంది. కీర్తి ఏమో వరుస సినిమాలతో బిజీ. అందుకే అన్ని విధాలా తిరిగి మళ్లీ కాజల్ అగర్వాల్ అయితే బెటర్ అని తేజ ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఇంతకుముందు గోపీచంద్ – కాజల్ కలిసి ఒక సినిమా కూడా చేయలేదు. ప్లస్ ఇద్దరి పెయిర్ కూడా బాగుంటుందని భావిస్తున్నారట. తేజ - కాజల్ కాంబినేషన్లో ఇది హ్యాట్రిక్ మూవీ కానుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించనున్న ఈ సినిమా ఓ రొమాంటిక్ జోనర్ అని తెలుస్తుంది. చూడాలి మరి గోపి-కాజల్ జంట ఏ రేంజిలో ఆకట్టుకుంటారో..!!