15 ఇయర్స్ ఇండస్ట్రీ కామన్ అయిందే!

Thu Sep 19 2019 07:00:01 GMT+0530 (IST)

Kajal Agarwal tamanna and Shriya Saran Completes 15 Years in Film Industry

30 ఇయర్స్ ఇండస్ట్రీ డైలాగ్ పాపులర్ కావడంతో కమెడియన్ పృథ్వీరాజ్ ను 30 ఇయర్స్ పృథ్వి గా పిలవడం మొదలు పెట్టారు.  అప్పటినుంచి ఈ ఎక్స్ పీరియన్స్ ను జోడించడం చాలామందికి కామన్ అయింది.  ఒకరిని 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటారు. కమల్ లాంటి వారైతే 50 ఇయర్స్ ఇండస్ట్రీ.  ఇక బ్రహ్మాజీ లాంటి పెద్దలు.. గ్యాంగ్ స్టర్ల టీచర్లు వీటికి అతీతమని రీసెంట్ గా నే అందరికీ తెలిసింది.  గుమ్మడి గారికి రూమ్మేట్ అంటే మాటలా??హీరోలు.. క్యారెక్టర్ ఆర్టిస్టులు అన్ని సంవత్సరాలు కొనసాగడం కష్టమే కానీ అసాధారణం మాత్రం కాదు. అయితే హీరోయిన్ల పరిస్థితి మాత్రం అలా ఉండదు.  ఐదేళ్ళు హీరోయిన్ గా కొనసాగడమే గొప్ప. ఇక పదేళ్ళు హీరోయిన్ గా కొనసాగితే రికార్డు సృష్టించినట్టే లెక్క. కానీ ఈమధ్య కొంతమంది హీరోయిన్ లు '15 ఇయర్ ఇండస్ట్రీ' మార్కు దాటి ఇంకా ముందుకు పోతున్నారు. ఈ లిస్టులో కాజల్ అగర్వాల్.. తమన్నా భాటియా.. శ్రియ శరణ్ లాంటి వారు ఉన్నారు.

కాజల్ సంగతే తీసుకుంటే 2004 లో 'క్యోం హోగయానా' అనే బాలీవుడ్ చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది. వివేక్ ఒబెరాయ్.. ఐశ్వర్య రాయ్.. అమితాబ్ బచ్చన్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు.  కాజల్ రోల్ చిన్నదే కానీ మొదటి సినిమాతోనే హేమాహేమీలతో వర్క్ చేయడం విశేషం. తెలుగులో కళ్యాణ్ రామ్ హీరోగా తేజ దర్శకత్వంలో తెరకెక్కిన 'లక్ష్మీ కళ్యాణం' మొదటి సినిమా.  అప్పటి నుంచి ఇప్పటివరకూ ఎన్నో భాషలలో నటించింది.. ఇప్పటికీ నటిస్తూనే ఉంది. ఇప్పటికీ చేతిలో క్రేజీ ఆఫర్లు ఉన్నాయి. 'భారతీయుడు 2' అందులో ఒకటి.  15 ఇయర్స్ ఇండస్ట్రీ.

తమన్నా సంగతి తీసుకుంటే 2005 లో 'చాంద్ సా రోషన్ చెహేరా' అనే బాలీవుడ్ చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది.  ఈ సినిమాలో హీరో సమీర్ అఫ్తాబ్.  ఈ సినిమాలో నటించినప్పుడు తమన్నా వయసు 15 ఏళ్ళు.  2005 లోనే మంచు మనోజ్ హీరోగా నటించిన 'శ్రీ' ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.  వచ్చే ఏడాది మార్చ్ కి తమన్నా ఫిలిం ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్ళు పూర్తవుతాయి. ఇప్పటికీ తమన్నాకు క్రేజీ ఆఫర్లే ఉన్నాయి. 'సైరా' లో ఒక హీరోయిన్ గా నటిస్తోంది.

ఇక శ్రియ అందరిలోకి సీనియర్. 2001 లో 'ఇష్టం' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. హీరో చరణ్ (రామ్ చరణ్ కాదు)ఈ సినిమాకు డైరెక్టర్లు విక్రమ్ కుమార్-రాజ్ కుమార్. ఈ దర్శకద్వయంలో  మొదటి వ్యక్తి 'నానీస్ గ్యాంగ్ లీడర్' డైరెక్టరే. శ్రియ అప్పటినుంచి ఇప్పటివరకూ దుమ్ము లేపుతూనే ఉంది.  శ్రియ చేతిలో క్రేజీ ప్రాజెక్టులు అయితే లేవు కానీ ఇప్పటికీ శ్రియ నటిస్తున్న నాలుగు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి.  18 ఇయర్స్ ఇండస్ట్రీ.

ఈ ముగ్గురిలో కామన్ గా ఉన్న అంశం ఏంటంటే ఇన్నేళ్ళు గడిచినా అదే గ్లామర్ మెయింటెయిన్ చెయ్యడం.. ఫేడ్ అవుట్ అయ్యారని విమర్శలు వచ్చిన  ప్రతి సారి ఏదో ఒక హిట్ సాధించి విమర్శకుల నోళ్ళు మూయించడం. ఇండస్ట్రీలో ఉన్న బడా స్టార్లు అందరితో నటించారు.  గ్లామర్.. నటన.. సరైన యాటిట్యూడ్ లేకుండా ఇన్నేళ్ళు హీరోయిన్ గా కొనసాగడం వీలు కాదు కదా.  ఈ జెనరేషన్లో ఇలాంటి అసాధారణ ఫీట్ ను సాధించిన ఈ ముగ్గురు హీరోయిన్లు కొత్తవారికి ప్రేరణగా నిలుస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు.  లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్.. ముగ్గురూ కష్టపడి పైకి వచ్చినవారే.. ఎవరికీ ఫిల్మీ బ్యాక్ గ్రౌండ్ లేదు.. నెపోటిజం బ్యాచ్ అంతకన్నా కాదు..! మరి ఈ బ్యూటిఫుల్ లేడీస్ కి హ్యాట్సాఫ్ చెప్పాలని అనిపించడం లేదా?