సౌత్ సినీ ఇండస్ట్రీపై చందమామ ప్రేమ అభిమానం

Fri Mar 31 2023 13:00:00 GMT+0530 (India Standard Time)

Kajal Agarwal Love For The South Film Industry

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ మళ్లీ సినిమాలతో బిజీ అయ్యింది. పెళ్లి.. ఆ తర్వాత తల్లి అవడం కారణంగా కాజల్ అగర్వాల్ సినిమాలకు చిన్న బ్రేక్ ఇచ్చింది. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ తో ఒక సినిమాను మరో వైపు యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ తో మరో సినిమాను చేస్తున్న కాజల్ అగర్వాల్ అతి త్వరలోనే సౌత్ లో మరో పెద్ద స్టార్ హీరో సరసన నటించబోతున్నట్లుగా సమాచారం అందుతుంది.ఈ సమయంలోనే కాజల్ అగర్వాల్ సౌత్ సినీ ఇండస్ట్రీ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రైజింగ్ ఇండియా సమిట్ 2023 లో భాగంగా కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ సినిమాకి భాష అనేది లేదని.. ఏ భాషలో అయినా సినిమా ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేయాలని తాను కోరుకుంటానని పేర్కొంది. అయితే తాను పుట్టి పెరిగింది అంతా ముంబైలోనే అయినా సౌత్ సినిమాలు ఎక్కువగా చేశాను.

తెలుగు మరియు తమిళంలో ఎక్కువగా నటించడం హైదరాబాద్ మరియు చెన్నై అంటే తనకు ప్రత్యేకమైన అభిమానమని చెప్పుకొచ్చింది. సౌత్ సినిమాల్లో స్నేహపూర్వక వాతావరణం ఎక్కువగా ఉంటుంది. అంతే కాకుండా హీరోయిన్ పాత్రలకు కాస్త ఎక్కువగా ఎక్స్పోజర్ లభిస్తుందని కాజల్ పేర్కొంది.

హిందీ సినిమాల్లో మరియు అక్కడి ఇండస్ట్రీలో నీతి.. విలువలు కొరవడ్డాయని ఆమె అభిప్రాయం వ్యక్తం చేసింది. సౌత్ సినిమాల్లో హీరోయిన్స్ కి ఇచ్చే ప్రాముఖ్యత కాస్త ఎక్కువ అందుకే నేను ఎక్కువగా సౌత్ సినిమాలకు ఓకే చెప్పాను అంది. సౌత్ సినిమా వారికి మరియు ప్రేక్షకులకు సినిమా అంటే గౌరవం. అందుకే తాను సౌత్ సినీ ఇండస్ట్రీలోనే కొనసాగాలని కోరుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది.

హిందీ సినిమాలు అన్నా కూడా తనకు గౌరవమని కాజల్ అగర్వాల్ పేర్కొంది. ప్రస్తుతం చేస్తున్న సినిమాలు మాత్రమే కాకుండా మరికొన్ని సినిమాల్లో కూడా నటించబోతున్నట్లుగా చెప్పుకొచ్చింది. ఎప్పటి వరకు సినిమాలు చేస్తాను అనే దానిపై క్లారిటీ లేదు.. కానీ ఎప్పటికీ చేయాలనుకుంటున్నట్లుగా పేర్కొంది.