Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: మరోసారి రెచ్చిపోయిన కాజల్

By:  Tupaki Desk   |   12 Sep 2019 7:34 AM GMT
ఫోటో స్టొరీ: మరోసారి రెచ్చిపోయిన కాజల్
X
టాలీవుడ్ లో ఉండే సీనియర్ బ్యూటీలలో కాజల్ ఆగర్వాల్ ఒకరు. అయితే ఎంత సీనియర్ అయినా గ్లామర్ విషయంలో మాత్రం న్యూ జెనరేషన్ హీరోయిన్లకు తీసిపోదు. 15 ఇయర్స్ ఇండస్ట్రీ అయినా జస్ట్ ఇప్పుడే ఎంట్రీ ఇచ్చిందని అనుకునేలా ఉండడం కాజల్ స్పెషాలిటి. ఇక ఫేడ్ అవుట్ అయిందని వార్తలు రావడం.. అంతలోనే ఒక హిట్ తో విమర్శకులకు షాక్ ఇవ్వడం కాజల్ కు అలవాటైపోయిన పని.

ఇక హాటు ఫోటోషూట్లు.. మ్యాగజైన్ కవర్ పేజిల పై మెరవడం వంటి విషయాలలో ఎవరైనా కాజల్ తర్వాతే. రీసెంట్ గా కాజల్ వివా లా మోర్ మ్యాగజైన్ కోసం ఒక హాటు ఫోటో షూట్ లో పాల్గొంది. బ్రౌన్ కలర్ లో ఉన్న ఒక మెరుస్తున్న డిజైనర్ డ్రెస్ లో సూపర్ పోజులిచ్చింది. డ్రెస్ చాలా రిచ్ గా కనిపిస్తోంది. ఫ్రంట్ ఓపెన్ ఉండే డ్రెస్ కావడంతో హాట్ నెస్ కు కేరాఫ్ అడ్రెస్ లాగా కనిపిస్తోంది. విభిన్నంగా కనిపిస్తున్న ఇయర్ రింగ్స్.. గోల్డ్ కలర్ హై హీల్స్ ధరించి ఒక మహారాణి తరహాలో టీపాయ్ పైన కూర్చుంది. నేపథ్యంలో ఉన్న ఫర్నిచర్.. లైట్స్ ఈ ఫోటోకు కొత్త అందాన్ని తీసుకొచ్చాయి.

ఈ ఫోటోకు నెటిజన్లు డంగైపోయారు. "సో సో బ్యూటిఫుల్".. "కాజల్ ఆన్ ఫైర్".. "నా లైఫ్ టైమ్ క్రష్".. "ఇస్మార్ట్ గా ఉన్నావు" అంటూ కామెంట్లు పెట్టారు. ఇక కాజల్ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే తమిళంలో 'ప్యారిస్ ప్యారిస్'.. 'ఇండియన్ 2 ' #సూర్య 39 చిత్రాల్లో నటిస్తోంది. ఇవి కాకుండా హిందీలో 'ముంబై సాగా' అనే చిత్రంలో కూడా నటిస్తోంది. తెలుగులో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'అ 2' లో నటిస్తోందనే టాక్ ఉంది.