Begin typing your search above and press return to search.

బర్త్ డే రోజున వినూత్నం గా వచ్చిన చందమామ!

By:  Tupaki Desk   |   18 Jun 2020 2:04 PM GMT
బర్త్ డే రోజున వినూత్నం గా వచ్చిన చందమామ!
X
సౌత్ ఇండస్ట్రీ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం 'మోసగాళ్లు' అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. మంచు విష్ణు హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ సునీల్ శెట్టి మరియు రుహానీ సింగ్, న‌వ‌దీప్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు, ఇంగ్లీష్‌ భాషల్లో ఒకేసారి రూపొందుతున్న ఈ సినిమా ఓ సైన్స్‌ ఫిక్షన్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ అని తెలుస్తోంది. ప్రపంచలోనే బిగ్గెస్ట్ ఐటీ స్కామ్ నేపథ్యంలో అమెరికాను సైతం వణికించిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. 24 ఫిలిం ఫ్యాక్టరీ మరియు ఏవీఏ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌ లపై మంచు విష్ణు స్వయంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు హాలీవుడ్‌ దర్శకుడు జెఫ్రీ గీ చిన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు.

కాగా చందమామ కాజల్ అగర్వాల్ బర్త్ డే ని పురష్కరించుకొని 'మోసగాళ్లు' చిత్ర యూనిట్ 'హ్యాపీ బర్త్ డే టూ అమేజింగ్ కాజల్' అంటూ ఆమెకు విషెస్ తెలియజేస్తూ విన్నూత్నమైన పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ లో సగభాగం మంచు విష్ణు ఉండగా మిగతా భాగం కాజల్ అగర్వాల్ లుక్ కనిపిస్తుంది. ఆ పోస్టర్లలో అర్జున్‌ గా విష్ణు, అను పాత్రలో కాజ‌ల్ అగ‌ర్వాల్‌ నటించబోతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా ఈ సినిమాలో కాజల్ మంచు విష్ణు కి సిస్టర్ గా కనిపించబోతోంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ‘మోస‌గాళ్లు’ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్‌ లుక్ విడుద‌ల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి స్పంద‌న ల‌భించింది. ఇప్పుడు కాజల్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ కూడా విశేషంగా ఆకట్టుకుంటోంది.

ఇదిలా ఉండగా ఐటీ స్కామ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా రూ. 3.5 కోట్ల వ్యయంతో ఒక భారీ ఐటీ ఆఫీస్ సెట్‌ ను నిర్మించారట. ఇక లాస్ ఏంజెల్స్‌ మరియు హైద‌రాబాద్ పరిసర ప్రాంతాలలో వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటూ వచ్చిన ‘మోసగాళ్లు’ చిత్రం లాక్‌ డౌన్ ప్రక‌టించ‌డంతో పూర్తిగా ఆగిపోయింది. విప‌త్కర ప‌రిస్థితి మెరుగుపడి సాధార‌ణ ప‌రిస్థితులు ఏర్పడ్డాక చిత్రీక‌ర‌ణ కొన‌సాగిస్తామ‌ని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ మధ్య ప్లాపుల్లో ఉన్న మంచు విష్ణు - కాజల్ అగర్వాల్ లు ఈ సినిమాపై ఆశలు పెట్టుకున్నారు. ఇక కాజల్ అగర్వాల్ జయాపజయాలతో పనిలేకుండా వరుస సినిమాలు చేస్తూ వస్తోంది. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ చేతిలో అర డజను సినిమాలు ఉన్నాయి.