పృథ్వీ రాజ్ పాన్ ఇండియా మూవీ వాయిదా

Mon Jun 27 2022 20:00:01 GMT+0530 (India Standard Time)

Kaduva Movie Postponed

మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ మాస్ డైరెక్టర్ షాజీ కైలాస్ కాంబినేషన్ లో రూపొందిన హై ఆక్టేన్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్  `కడువా` పాన్ ఇండియా కేటగిరీలో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. మారిన ట్రెండ్ లో పృథ్వీరాజ్ సుకుమారన్ ఇరుగుపొరుగు మార్కెట్లపై కన్నేశారు. ఈ నెల 30న మలయాళం- తెలుగు- తమిళం- కన్నడ- హిందీ భాషల్లో ఈ మూవీ విడుదల కావాల్సి ఉంది. కానీ తాజాగా  7 జూలైకి వాయిదా వేసామని చిత్రబృందం ప్రకటించింది. ప్రస్తుత ప్రతికూల పరిస్థితిలో ఈ సినిమాని రిలీజ్ చేయలేకపోతున్నామని టీజర్ తో అందరికీ కనెక్టయిన ఈ సినిమాని వాయిదా వేస్తున్నందుకు అభిమానులు పంపిణీదారులు.. థియేటర్ యజమానులు క్షమించాలని టీమ్ కోరింది. ప్రమోషన్స్ ని యథాతథంగా కొనసాగిస్తామని వెల్లడించింది.ఆకట్టుకున్న టీజర్..

ఇంతకుముందే `కడువా` తెలుగు వెర్షన్ ప్రమోషన్స్ కోసం టీమ్ హైదరాబాద్ వచ్చిన సంగతి తెలిసిందే. నేచురల్ స్టార్ నాని టీజర్ ను విడుదల చేశారు. మోస్ట్ పవర్ ఫుల్ జెంటిల్ మేన్ (పృథ్వీరాజ్) వర్సెస్ పవర్ ఫుల్ పోలీసు ఆఫీసర్ (వివేక్ ఒబెరాయ్) నడుమ వార్ ఏమిటన్నది తెరపైనే చూడాలి. రెండు ప్రధాన పాత్రల మధ్య ఉన్న శత్రుత్వాన్ని టీజర్ లో ఆవిష్కరించగా ఇది భీమ్లా నాయక్ వర్కెస్ డేనియల్ వార్ తరహాలో కనిపించింది.

90ల నాటి రెట్రో స్వాగ్ ని తీసుకువచ్చిన టీజర్ లో పృథ్వీరాజ్ యాక్షన్ ఎపిసోడ్స్ ఆద్యంతం ఆకట్టుకున్నాయి. అద్భుతమైన విజువల్స్.. మనసు దోచే బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. స్టైలిష్ టేకింగ్ మూవీపై ఆసక్తిని పెంచాయి. పృథ్వీరాజ్ పంచెకట్టులో మాసీగా కనిపించగా.. వివేక్ ఒబెరాయ్ పోలీస్ ఆఫీసర్ గా అంతే పవర్ ఫుల్ గా కనిపిస్తున్నారు. ఈ చిత్రంలో యాక్షన్- థ్రిల్ - డ్రామా ఎక్కువగా ఉన్నాయని టీజర్ వెల్లడిస్తోంది.

భీమ్లా నాయక్ ఫేమ్ సంయుక్తా మీనన్ కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని మ్యాజిక్ ఫ్రేమ్స్ - పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై లిస్టిన్ స్టీఫెన్ -సుప్రియా మీనన్ నిర్మించారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందించారు.