Begin typing your search above and press return to search.

కబ్జా ఫస్ట్ డే కలెక్షన్లు.. 10 లక్షలు కూడా రాలేదుగా!

By:  Tupaki Desk   |   18 March 2023 1:00 PM GMT
కబ్జా ఫస్ట్ డే కలెక్షన్లు.. 10 లక్షలు కూడా రాలేదుగా!
X
విలక్షణ నటుడు, కన్నడ మెగా సూపర్ స్టార్ ఉపేంద్ర తాజాగా నటించిన సినిమా కబ్జా గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ చిత్రంలో ఉపేంద్ర సరసన శ్రియా శరణ్ నటిస్తుండగా.. సుదీప్, శివ రాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎంటీబీ నాగరాజ్ సమర్పణలో శ్రీ సిద్దేశ్వర ఎంటర్ ప్రైజెస్ బ్యానర్ పై ఆర్. చంద్రు దర్శకత్వం వహిస్తున్న కబ్జా సినిమా మార్చి 17వ తేదీ (శుక్రవారం) రిలీజ్ అయింది. కానీ అనుకున్న మేర ఫలితాలను అందించలేకపోయిందీ చిత్రం.

పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద భారీ పరాజయాన్ని అందుకుంది. ఎర్లీ మార్నింగ్ షోలు లేకపోవడంతో కర్ణాటకలోని సింగిల్ స్క్రీన్ లలో కబ్జా సినిమా మొదటి రోజు కనీసం 10 లక్షల మార్కును కూడా దాటలేక పోయింది. పాన్ ఇండియా మల్టీ స్టారర్ గా అంచనా వేసినప్పటికీ... ఎవరిలోనూ అంత ఇంట్రెస్ట్ ను కల్గించలేకపోయిందీ చిత్రం. కన్నడ, హిందీ, తమిళ్, తెలుగు, మలయాళం భాషల్లో ఈ సినిమా విడుదల కాగా.. ఎక్కడా పెద్దగా ఆడడం లేదు. కనీసం కర్ణాటకలోనైనా ఆడుతుంది అనుకుంటే అక్కడా నిరాశే మిగిల్చింది.

అయితే ఈ ఏడాది సింగిల్ స్క్రీన్లలో మొదటి రోజు 10 లక్షలు వసూలు చేసిన సినిమాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. కన్నడ స్టార్ హీరో దర్శన్ ఇటీవలే హీరోగా నటించిన చిత్రం క్రాంతి. ఈ సినిమా జనవరి 26వ విడుదలై బాక్సాఫీసు వద్ద మాత్రం అట్టర్ ప్లాప్ గా నిలిచింది. 20 కోట్ల షేర్ ని కూడా వసూలు చేయలేకపోయింది. మొదటి రోజు కేవలం ఐదు స్ర్కీన్లలో ఆడి పది లక్షలకు పైగా వసూళ్లను రాబట్టింది.

సంక్రాంతి బరిలో నిలిచిన అజిత్ కుమార్ సినిమా తునీవుకు ఖాకీ ఫేమ్ హెచ్ వినోద్ దర్శకత్వం వహించారు. బ్యాంక్ రాబరీ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో మంజు వారియర్, సముద్రఖని వంటి వారు కీలక పాత్రలు పోషించారు. అయితే ఈ చిత్రం మొదటి రోజు కేవంల మూడు సింగిల్ స్క్రీన్లలో మాత్రమే ఆడింది. ప్రసన్న, బాలాజీ, శ్రీనివాసలో ఆడి 10 లక్షలకు పైగా వసూళ్లు రాబట్టింది. బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ సినిమా భారీ వసూళ్లను రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. అయితే మొదటి రోజు ఊర్వశి థియేటర్లో ఆడి పది లక్షలకు పైగా వసూళ్లను రాబట్టింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.