దసరాతో ఆ తమిళ సినిమా పోలికేంటి..?

Fri Mar 31 2023 14:00:01 GMT+0530 (India Standard Time)

Kabali Pa Ranjith Comparing Dussehra Movie With A Tamil Movie Madras

గురువారం రిలీజైన నాని దసరా సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సినిమాలో నాని మాత్రం తన కొత్త లుక్స్ నటనతో ఆకట్టుకున్నాడు. ఇక నూతన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తన దర్శకత్వ ప్రతిభ చాటాడని చెప్పొచ్చు.



రా అండ్ రస్టిక్ సినిమాలతో ఆడియన్స్ ని ఎంగేజ్ చేయడం చాలా కష్టం సుకుమార్ శిష్యుడిగా శ్రీకాంత్ గురువు దగ్గర ఉన్న ఆ స్కిల్ పట్టేశాడని చెప్పుకుంటున్నారు. అయితే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న దసరా సినిమాను ఓ తమిళ సినిమాతో పోల్చి చూస్తున్నారు కొందరు.

తమిళంలో ఇలాంటి రా అండ్ రస్టిక్ సినిమాలను తీసే దర్శకులు చాలామంది ఉన్నారు. అందులో కబాలి పా రంజిత్ ఒకరు. ఆయన చేసిన మద్రాస్ సినిమా రిఫరెన్స్ లు దసరా సినిమాలో ఉన్నాయని అంటున్నారు.

2014లో వచ్చిన మద్రాస్ సినిమాలో కార్తీ కలియరాసన్ నటించారు. కాళి అంబు అనే ఇద్దరు స్నేహితుల కథ అది. ఉత్తర మద్రాస్ లో ఒక కాలజీలో గోడ ఉంటుంది దాని మీద ఎవరి నాయకుల బొమ్మలు ఉండాలనే విషయం మీద వివాదం మొదలవుతుంది.

లోకల్ లీడర్స్ ఇద్దరి మధ్య గొడవ.. మద్రాస్ సినిమా చివర్లో ఆ గోడని శుభ్రం చేస్తారు. దసరా సినిమా కూడా ధరణి సూరి స్నేహితులు వీరపల్లె లోని ఊళ్లో ఒక బార్.. దాని మీద పెత్తనం విషయంలో ఇరు వర్గాల గొడవ. స్నేహితులు ఇద్దరు ఒక వర్గానికి అనుచరులుగా మారి అవతల వర్గం పగ పట్టి కథ నడిపిస్తారు.

అక్కడ గోడని శుభ్రం చేసినట్టే దసరాలో సిల్క్ బార్ ని తగలబెడతారు. అయితే ఇందులో ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఒకటి యాడ్ చేశారు.

ఒక సినిమా రిలీజ్ అవగానే దానికి రిలేటెడ్ గా ఉన్న అన్ని సినిమాలను చేర్చి సోషల్ మీడియాలో హడావిడి చేయడం ఇప్పుడు కామన్ అయ్యింది. ఓటీటీలు వచ్చాక ఎక్కడెక్కడి సినిమాలు కూడా ప్రేక్షకులు చూసేస్తున్నారు.

చిన్న సీన్ కాపీ చేసినా ఆడేసుకుంటున్నారు. అయితే దసరా సినిమాకు మద్రాస్ సినిమాకు ఎలాంటి సంబంధం లేకపోయినా ఈ టైం లో మద్రాస్ సినిమాని గుర్తు చేసుకుంటూ ఆ కథకు దసరా కథకు లింక్ పెట్టేస్తున్నారు.