Begin typing your search above and press return to search.

కె.ఎల్.రాహుల్ పెళ్లి.. అదిరిపోయే గిఫ్ట్స్

By:  Tupaki Desk   |   26 Jan 2023 9:23 AM GMT
కె.ఎల్.రాహుల్ పెళ్లి.. అదిరిపోయే గిఫ్ట్స్
X
ఇండియన్ క్రికెటర్ కె.ఎల్.రాహుల్ తాజాగా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ నటి, ఒకప్పటి హీరో సునీల్ శెట్టి కూతురు అతియా శెట్టిని రాహుల్ వివాహం చేసుకున్నాడు. చాలా కాలంగా వీరిద్దరూ డేట్ లో ఉన్న సంగతి అందరికి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఈ డేట్ రిలేషన్ ని నెక్స్ట్ లెవల్ కి తీసుకొని వెళ్తూ పెళ్లి చేసుకున్నారు. బాలీవుడ్ ప్రముఖులు, వారి కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి వివాహం చాలా గ్రాండ్ గా హిందూ సంప్రదాయ పద్ధతిలో జరిగింది.

ఇదిలా ఉంటే వీరి పెళ్లికి సంబందించిన ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియాలోకి వచ్చి వైరల్ గా మారాయి. ఇక కె.ఎల్.రాహుల్ కి ఇప్పుడు అతియా శెట్టి నుంచి వచ్చిన కట్నం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

రాహుల్ కి సునీల్ శెట్టి ఏకంగా ముంబాయ్ లో 50 కోట్ల విలువైన ప్లాట్ ఇచ్చాడని తెలుస్తుంది. అల్లుడు, కూతురుకి బహుమతి రూపంలో ఈ భారీ ఖరీదైన ప్లాట్ ని ఇచ్చినట్లు బిటౌన్ లో వినిపిస్తుంది.

ఇక మాజీ కెప్టెన్ టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి కూడా ఏకంగా 2.17 కోట్ల విలువైన బిఎండబ్యూ కారుని తన మిత్రుడు కె.ఎల్.రాహుల్ కి ఇచ్చినట్లు తెలుస్తుంది. విరాట్ కోహ్లికి రాహుల్ కి మంచి అనుబంధం ఉంది.

ఈ నేపధ్యంలోనే అంత ఖరీదైన కారుని కోహ్లి కొత్త జంటకి గిఫ్ట్ గా ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇక బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా అతియా శెట్టి, రాహుల్ దంపతులకి 1.64 కోట్ల విలువైన ఆడీ కారుని బహుమతిగా ఇచ్చాడు.

ఇక జాకీష్రాఫ్ 30 లక్షల ఖరీదు ఉన్న వాచ్ ని రాహుల్ కి గిఫ్ట్ గా ఇచ్చాడు. ఇక టీమ్ ఇండియా మాజీ ఆటగాడు, కెప్టె మహేంద్ర సింగ్ ధోనీ అయితే ఏకంగా 80 లక్షల విలువైన కవసాకి నింజా బైక్ ని రాహుల్ కి గిఫ్ట్ గా ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇక బహుమతుల రూపంలోనే రాహుల్, అతియా శెట్టి దంపతులకి వంద కోట్ల వరకు ఆస్తి వచ్చినట్లుగా బిటౌన్ లో వినిపిస్తున్న మాట.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.