ఈసారి రెండు 'మసాలా సాంగ్స్'తో కేజీఎఫ్ సీక్వెల్..!

Tue May 04 2021 09:00:02 GMT+0530 (IST)

KGF sequel with two 'Item songs'

ప్రస్తుతం దేశవ్యాప్తంగా సినీప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్న సినిమాలలో కేజీఎఫ్ -2 ఒకటి. 2018 డిసెంబర్ నెలలో పాన్ ఇండియా వైడ్ యాక్షన్ థ్రిల్లర్ గా విడుదలైన కేజీఎఫ్ సినిమా.. అప్పట్లో రికార్డులు కొల్లగొట్టింది. కేజీఎఫ్ సినిమాతో అటు హీరోకు దర్శకుడికి పాన్ ఇండియా ఫేమ్ రాగా.. నిర్మాతకు కూడా కావాల్సినంత కాసుల వర్షం కురిపించింది. దేశవ్యాప్తంగా విడుదలైన ఐదు భాషల్లో కేజీఎఫ్ సినిమా సూపర్ సక్సెస్ అందుకుంది. అలాగే ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరైంది. అందుకే ఎప్పుడెప్పుడు సీక్వెల్ రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు.ప్రస్తుతం కేజీఎఫ్ పార్ట్ -1 కొనసాగింపుగా కేజీఎఫ్-2 సిద్ధం అవుతోంది. కన్నడస్టార్ హీరో యష్ - శ్రీనిధిశెట్టి నాయకనాయికలుగా తెరకెక్కిన ఈ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ అదిరిపోయే స్టోరీ - సాలిడ్ యాక్షన్ - ఫైట్ సన్నివేశాలతో తెరకెక్కించాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఈ మూవీతో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్డం అందుకున్నాడు. నిజానికి కేజీఎఫ్ సినిమాలో యాక్షన్ స్టోరీతో పాటు పాటలు బాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓ రేంజిలో ఊపు ఊపేసాయి. ఇవేగాక మాస్ ప్రేక్షకుల టేస్ట్ దృష్టిలో పెట్టుకొని ఓ అదిరే ఐటమ్ సాంగ్ సినిమాలో పెట్టారు. మరి ఈసారి ఎలాంటి సాంగ్ పెట్టనున్నారో అని అంచనాలు పెరిగిపోయాయి.

ఇప్పటికే కేజీఎఫ్-2 టీజర్ కూడా రికార్డులు క్రియేట్ చేసింది. కేజీఎఫ్ లో మిల్కీబ్యూటీ తమన్నాతో 'దోచేయ్' అనే మసాలా సాంగ్ చూపించిన మేకర్స్.. ఈసారి చాప్టర్-2లో రెండు మసాలా సాంగ్స్ రికార్డు చేయించినట్లు టాక్. అందులోను స్టార్ బాలీవుడ్ యాక్ట్రెసెస్ జాక్వెలిన్ ఫర్నాండేజ్ - నోరాఫతేహి ఐటమ్ సాంగ్స్ లో ఆడిపాడనున్నట్లు సమాచారం. అయితే కేజీఎఫ్ లో సౌత్ ప్రేక్షకులకు ఓ సాంగ్ నార్త్ ప్రేక్షకులకు ఓ సాంగ్ డిజైన్ చేశారు. సౌత్ లో తమన్నా.. నార్త్ లో మౌనిరాయ్ ఆడిపాడారు. మరి ఈసారి కూడా అలాగే ప్లాన్ చేయనున్నారా లేదా నిజంగా రెండు ఐటమ్ సాంగ్స్ పెడతారా అనేది తెలియాల్సి ఉంది. ఈ పాన్ ఇండియా సినిమాను విజయ్ కిరగందుర్ నిర్మిస్తుండగా.. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.