యశ్ లో విన్నర్స్ యాటిట్యూడే అతన్ని స్టార్ ని చేసింది!

Mon Jul 04 2022 12:33:43 GMT+0530 (India Standard Time)

KGF Hero Yash Winning Attitude

సంపాదించడం ఒక్కటే కాదు. దాన్ని తెలివిగా ఇన్విస్ట్ చేయాలి. అది డబ్బు అయినా..ట్యాలెంట్ అయినా..స్కిల్ అయినా సరే. అప్పుడే అనుకున్న లక్ష్యాన్ని చేరగలం. సవ్యమైన మార్గంలో వాటిని ఇన్విస్ట్ చేసినప్పుడు టార్గెట్ రీచ్ అవుతాం.  ఏరంగంలో రాణించాలన్నా ఈ స్కిల్స్ తప్పనిసరి. తెలివి తేటల్నే పెట్టుబడిగా పెట్టి బిలీయనీర్స్  గా ఎదిగిన వారెందరో.ప్రపంచాన్ని శాషిస్తోన్న ఎంతో మంది మేథావులు కేవలం డబ్బుతోనే ఆస్థాయికి చేరుకోలేదు. అంతకు మించి తమ తెలివితేటలు...ప్రతిభ ఆధారంగానే సాధ్యమయ్యాయి అన్నది నమ్మాల్సిన నిజం. విన్నర్స్ యాటిట్యూడ్ ఉన్నవాడికే ఇదంతా సాధ్యం.  అవును  కన్నడ రాకింగ్ స్టార్ యశ్  ఎదిగిన వైనం చూస్తే ఈ విషయాలన్ని మరోసారి స్మరించుకోక తప్పదు.

అతను ఎదిగిన విధానం నిజంగా ఎంతో మందికి  స్ఫూర్తినిస్తుంది. ప్రతిభ ఆధారంగానే  పాన్ ఇండియా స్టార్ అయ్యాడు అన్నది పచ్చి నిజం. నర్మగర్భంగా ఒప్పుకోవాల్సిన వాస్తవం. విన్నర్స్ యాటిట్యూడ్  ఉన్న వాళ్లే లక్ష్యాల్ని చేధించగలరని యశ్ ని చూస్తే తెలుస్తుంది.  విజయం విషయంలో వాళ్లకి ఓ క్లారిటీ ఉంటుంది. ఏది చేసినా పట్టుదలగా చేస్తారు.

అవసరమైతే తగ్గడానికి..నెగ్గడానికి రెడీగా ఉంటారు. బయట సమాజానికి అలాంటి అచీవర్స్ చేసే పనులు ఓ పిచ్చోడ్ని చూసినట్లు అనిపిస్తుంది. కానీ వాళ్ల లైఫ్ విషయంలో వాళ్లు పూర్తి క్లారిటీతో  ఉంటారు.  వాళ్లు జీవితాన్ని చాలా గొప్పగా ఉన్నతంగా ఊహించుకుంటారు .అందుకోసం ఎంతైనా శ్రమిస్తారు. ఎక్కడ ఉండాలని  వాళ్లు అనుకుంటారో? అక్కడ ఉన్నట్లు గా ఊహించుకుంటారు.

అలా ఆలోచించినప్పుడే గమ్యస్థానానికి చేరుకోవాడనికి మార్గాలు..మెట్లు కనిపిస్తాయి. యశ్ ప్రయణం ఇలాగే సాగింది. అతను సీరియల్స్ చేసి నేడు పాన్ ఇండియా స్టార్ అయ్యాడంటే? అతని లైఫ్ని ఆ రకంగా విజువలైజ్ చేసుకున్నాడు కాబట్టే.  ఆరకమైన శ్రమ..కష్టం పడ్డాడు కాబట్టే సానుకూలమైన ఫలితాలు వచ్చాయి. ఒక హీరో అనేవాడు ఎలా ఉండాలి? అన్నది  అతను మనసులో బలంగా వేసుకున్నాడు. తను హ్యాండ్ సమ్ గా కనిపంచడం కోసం చిన్న ఆదాయాన్నే పెట్టుబడిగా పెట్టాడు.

ఆ రకంగా కనిపించడానికి తన చిన్న పాటి సంపాదనే  తనపై ఇన్విస్ట్ చేసాడు. కారు..బంగాళా అని కాకుండా వచ్చిన చిన్న ఆదాయంతోనే మంచి బట్టలు  కోసం ఖర్చు చేసాడు. హెయిర్ స్టైల్ ..బ్రాండెడ్ షూస్ ఇలా ఆహార్యం విషయంలో తన సంపాదనని పెట్టుబడిగా పెట్టాడు. ఇప్పుడు ఒక్కో సినిమాకు కోట్ల రూపాయలు పారితోషికం అందుకుంటున్నాడు. వచ్చిన లాభాల్లో సైతం వాటా అందుకునే స్థాయికి ఎదిగాడు. అందుకే 'కష్టే ఫలి' అన్న మాటని ఇక్కడ మరోక్కసారి గుర్తు చేసుకోవాలి.