Begin typing your search above and press return to search.

KGF స్టార్.. నెక్స్ట్ డైరెక్టర్ ఫిక్స్?

By:  Tupaki Desk   |   29 May 2022 4:33 AM GMT
KGF స్టార్.. నెక్స్ట్ డైరెక్టర్ ఫిక్స్?
X
కేజిఎఫ్ సినిమా తో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న స్టార్ హీరో యష్ ఆ తర్వాత ఎలాంటి సినిమాతో వస్తాడు అనేది ప్రస్తుతం సినీ ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారింది. అతను ఇప్పుడు కేవలం ఒక కన్నడ హీరో మాత్రమే కాదు ఇండియా మొత్తంలో కూడా అత్యధిక మార్కెట్ ఉన్న హీరోల్లో కూడా ఒకడిగా నిలిచాడు. కాబట్టి అన్ని ఇండస్ట్రీలు కూడా యష్ నెక్స్ట్ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాయి అని చెప్పవచ్చు.

ఆ మధ్య కాలంలో టాలీవుడ్ అగ్ర దర్శకులతో కూడా చర్చలు జరిగాయి కానీ ఏవి కూడా అనుకున్నట్లు సెట్ అవ్వలేదు. అంతేకాకుండా పూరి జగన్నాథ్ కూడా చర్చలు జరిపినట్లు కూడా యష్ ఒకసారి క్లారిటీ ఇచ్చాడు.

కానీ ఫైనల్ కథ కరెక్ట్ గా నచ్చక పోవడంతో హీరో ఆ ప్రాజెక్ట్ చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించలేదు అని సమాచారం. కేజిఎఫ్ తర్వాత వచ్చే సినిమా కాబట్టి అంతకుమించి ఉండాలి అని అంచనాలను అందుకునే విధంగా ఉండాలి అని కథల విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు.

ఏమాత్రం టెంప్ట్ అవ్వకుండా మంచి కథతోనే అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండాలి అని యష్ అనుకుంటున్నాడు. అయితే ఈ హీరో తదుపరి సినిమాను నర్థన్ అనే దర్శకుడి తో చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ దర్శకుడు 2017 లో మఫ్టీ అనే సినిమా తీశాడు. శివ రాజ్ కుమార్, శ్రీ మురళి కలిసి నటించిన ఆ సినిమా కన్నడ లో మంచి విజయాన్ని అందుకుంది. ఆ సినిమాను తెలుగు తమిళంలో కూడా రీమేక్ చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఇక నర్థన్ పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగా మంచి యాక్షన్ కథను రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. యష్ కూడా ఆ కథపై చాలా పాజిటివ్ గా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం అయితే నర్థన్ దర్శకత్వంలోనే సినిమా చేయాలి అనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే హోంబల్ సంస్థతోపాటు దిల్ దిల్ రాజు నిర్మాణంలో ఆ ప్రాజెక్ట్ను తెరపైకి తీసుకు రావాలనే ఆలోచనలో కూడా ఉన్నట్లు సమాచారం. మరి ఇది ఎంత వరకు నిజం అవుతుందో చూడాలి.