Begin typing your search above and press return to search.

కె.జి.ఎఫ్ ఫ‌స్ట్ లుక్ ట్రీట్ కి రెడీ

By:  Tupaki Desk   |   14 Dec 2019 8:26 AM GMT
కె.జి.ఎఫ్ ఫ‌స్ట్ లుక్ ట్రీట్ కి రెడీ
X
క‌న్న‌డ రాకింగ్ స్టార్ య‌శ్ న‌టించిన కె.జి.ఎఫ్ సంచ‌ల‌నాల గురించి తెలిసిందే. య‌శ్ ని 100 కోట్ల క్ల‌బ్ హీరోని చేయ‌డ‌మే గాక‌.. పాన్ ఇండియా హీరోగానూ ఆవిష్క‌రించింది ఈ చిత్రం. కె.జి.ఎఫ్ క‌న్న‌డ‌తో పాటు హిందీ-తెలుగు-త‌మిళంలోనూ విజ‌యం సాధించింది. కోలార్ బంగారు గ‌నుల్లో మాఫియా నేప‌థ్యంలో ఆద్యంతం ఉత్కంఠ రేపే క‌థాంశంతో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ కి అంతే పేరొచ్చింది. హోంబ‌లే ఫిలింస్ సంస్థ పేరు ఒక్క‌సారి గా మార్మోగి పోయింది.

ఇలాంటి గ్రేట్ ఫిలిమ్ కి సీక్వెల్ తెర‌కెక్కుతోంది! అంటే ఆ క్యూరియాసిటీ హైలెవ‌ల్లోనే ఉంటుంది. ఈసారి రాఖీ భాయ్ యాక్ష‌న్ ఏ లెవ‌ల్లో ఉంటుందోన‌న్న అంచ‌నాలు ఇప్ప‌టికే అభిమానుల్ని ఊపేస్తున్నాయి కె.జి.ఎఫ్‌ చాప్టర్ 2 టైటిల్ లుక్ తాజాగా రివీలైంది. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ఈనెల 21న సాయంత్రం 5:45 కి విడుదల చేయనున్నారు. ఈ మేరకు చిత్ర యూనిట్ అధికారిక పోస్టర్ విడుదల చేసింది. పార్ట్ 2లో రాఖీ భాయ్ యష్ లుక్ ఎలా ఉండ‌నుంది? అన్న‌ది తెలియాలంటే మ‌రో ఆరు రోజులు వేచి చూడాల్సిందే.

ఈ క్రేజీ మూవీలో మున్నాభాయ్ సంజయ్ దత్ ప్రధాన విలన్ అధీరాగా న‌టిస్తున్నారు. ఇంత‌కుముందు రిలీజ్ చేసిన అధీరా లుక్ కి అద్భుత స్పంద‌న వ‌చ్చింది. మాఫియా సామ్రాజ్యంలో తాడిని త‌న్నేవాడొక‌డుంటే వాడి త‌ల‌ను త‌న్నేవాడు వేరొక‌డు ఉంటాడ‌ని ఈ సీక్వెల్ చిత్రంలో చూపించ‌బోతున్నారు. అందుకు త‌గ్గట్టే కోలార్ గ‌నుల్లో భారీ యాక్ష‌న్ క‌ట్టిప‌డేస్తుంద‌ని చెబుతున్నారు. 2020లో కె.జి.ఎఫ్ పాన్ ఇండియా లెవ‌ల్లో అత్యంత భారీగా రిలీజ్ కానుంది.