Begin typing your search above and press return to search.

ఇదేం రచ్చ బాబోయ్‌... కేజీఎఫ్‌ 2 నాలుగు వారాల కలెక్షన్స్‌

By:  Tupaki Desk   |   14 May 2022 10:32 AM GMT
ఇదేం రచ్చ బాబోయ్‌... కేజీఎఫ్‌ 2 నాలుగు వారాల కలెక్షన్స్‌
X
కన్నడ స్టార్‌ యశ్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్ దర్శకత్వంలో రూపొంది నాలుగు వారాల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన కేజీఎఫ్ 2 సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా 500 కోట్ల వసూళ్లు నమోదు చేస్తే అద్బుతం అని అంతా అనుకున్నారు.

కాని ఈ సినిమా ఏకంగా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. మూడవ వారం.. నాల్గవ వారంలో కూడా పలు ఏరియాల నుండి ఇంకా సాలిడ్ షేర్ రావడం చూస్తుంటే ఇదేం రచ్చ బాబోయ్‌ అనిపించక మానదు.

నాలుగు వారాలు పూర్తి అయ్యేప్పటికి కేజీఎఫ్ 2 సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.1156 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను రాబట్టింది. కన్నడ సినీ చరిత్రలో ఆల్‌ టైమ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కేవలం కన్నడ నాటే కాకుండా ఇంకా పలు చోట్ల కూడా కేజీఎఫ్ రికార్డుల వేట కనిపించింది. హిందీలో దంగల్ రికార్డును బ్రేక్ చేసిన ఘనత కేజీఎఫ్‌ 2 కు దక్కింది. అక్కడ దాదాపుగా నాలుగు వందల కోట్ల వసూళ్లను రాబట్టింది.

ఇక ఓవర్సీస్ తో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా కేజీఎఫ్ 2 సాధించిన వసూళ్లు అనితర సాధ్యం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 2022 లో అత్యధిక గ్రాస్ వసూళ్లను సాధించిన చిత్రంగా కేజీఎఫ్‌ 2 నిలిచింది అనడంలో సందేహం లేదు. ఆల్‌ టైమ్‌ రికార్డ్‌ సినిమాల జాబితాలో కూడా కేజీఎఫ్ 2 కు నెం.3 స్థానం దక్కింది.

నెంబర్‌ 1 లో దంగల్‌ సినిమా ఉండగా.. నెం.2 స్థానంలో బాహుబలి 2 నిలిచింది. నెం.3 లో ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా దక్కించుకోగా.. ఆ స్థానంను కేజీఎఫ్ 2 కొన్ని రోజుల్లోనే నెం.3 గా నిలిచి ఆర్ ఆర్‌ ఆర్‌ ను నెం.4 స్థానంకు నెట్టి వేసింది. కేజీఎఫ్ 2 సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసి యశ్‌ మరియు ప్రశాంత్‌ నీల్‌ స్థాయి అమాంతం పెంచేసింది.

ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా రికార్డు లను చాలా ఈజీగా బ్రేక్ చేసిన కేజీఎఫ్‌ కు మరో పార్ట్‌ కూడా వస్తుందనే నమ్మకంను ఇప్పటికే దర్శకుడు ప్రశాంత్‌ నీల్ వెళ్లడించాడు. ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ తదుపరి సలార్‌ సినిమా పనిలో ఉన్నాడు. కేజీఎఫ్ 2 సంచలన విజయం నేపథ్యం లో సలార్ పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉండబోతున్నాయి. వచ్చే ఏడాదిలో సలార్‌ విడుదల కావచ్చు అంటున్నారు.