Begin typing your search above and press return to search.

'#KG7' టైటిల్ - ఫస్ట్ లుక్ అప్డేట్..!

By:  Tupaki Desk   |   19 Jun 2021 8:30 AM GMT
#KG7 టైటిల్ - ఫస్ట్ లుక్ అప్డేట్..!
X
'Rx 100' ఫేమ్ యువ హీరో కార్తీకేయ ప్రస్తుతం శ్రీ సరిపల్లి దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇది కార్తికేయ నటిస్తున్న 7వ సినిమా. ఇందులో ఆయన ఎన్ఐఏ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. కన్నడ నటుడు రవిచంద్రన్ మనవరాలు తాన్యా రవిచంద్రన్ ఈ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే విడుదల చేయబడిన ఈ మూవీ కాన్సెప్ట్ వీడియో ఆకట్టుకుంది.

కోవిడ్ ససెకండ్ వేవ్ పరిస్థితుల తర్వాత తిరిగి సెట్స్ మీదకు తీసుకెళుతున్న సందర్భంగా రేపు (ఆదివారం) '#KG7' టైటిల్ మరియు ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ''ఇంట్లో కొన్ని రోజులు గడిపిన తరువాత.. నా తదుపరి సినిమా ఫస్ట్ లుక్ మరియు టైటిల్‌ ను వెల్లడించడంతో ముందుకు సాగడం ఆనందంగా ఉంది'' అని కార్తికేయ ట్వీట్ చేశారు.

'#KG7' చిత్రంలో సాయి కుమార్ - తనికెళ్ళ భరణి - సుధాకర్ కోమాకుల - పశుపతి ఇతర కీలక పాత్రల్లో నటించనున్నారు. ‘మెంటల్ మదిలో’ ‘దొరసాని’ చిత్రాలకు స్వరాలు అందించిన ప్రశాంత్ ఆర్ విహారి ఈ మూవీకి సంగీతం సమకూరుస్తున్నారు. పి.సి.మౌళి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నాడు. టి.ఆదిరెడ్డి సమర్పణలో 88 రామారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘చావు కబురు చల్లగా’ పరాజయం చెందడంతో అభిమానులకు సారీ చెప్పిన కార్తికేయ.. ఈసారి చేయబోయే సినిమా తప్పకుండా ఆకట్టుకుంటుందని హామీ ఇచ్చాడు.