యూట్యూబ్ స్టార్ నెక్ట్స్ టార్గెట్ ఏంటి?

Mon Apr 15 2019 17:03:11 GMT+0530 (IST)

KA Paul becomes youtube Star

తెలుగు రాష్ట్రాల్లో ఈసారి ప్రచారం ఎలా సాగింది.? కొందరు కోపంతో ప్రచారం చేశారు.. మరికొందరు గెలవాలని కసిగా  చేశారు.. బీజేపీ లాంటి పార్టీలు అయితే బాబును ఓడగొట్టాలని పగతో ప్రచారం చేశారు. జనసేనాని పవన్ మార్పు కోసం రంగంలోకి దిగారు. కానీ ఒకే ఒక్కడు.. ఆడుతూ పాడుతూ ప్రజలకు ఎంటర్ టైన్ మెంట్ పంచుతూ ప్రచారం చేశాడు. బాబు-జగన్-పవన్ ల ప్రచార వేడి ఏపీని అట్టుడికించగా.. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రచారం మాత్రం జనాలకు కావాల్సినంత వినోదాన్ని పంచింది..ప్రచారంలో ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ కామెడీ చేయాలో చూపించాడు కేఏ పాల్. ఏపీ ఎన్నికల్లో ఈసారి మొత్తం హైలెట్స్ ఏవన్నా ఉన్నాయంటే అది కేఏపాల్ ప్రచారమనే చెప్పొచ్చు. ఆయన పార్టీ గుర్తు హెలీక్యాప్టర్ అందరికీ చేరువైపోయింది. ఏపీలో గెలిచాక బాబును అసిస్టెంట్ గా పెట్టుకుంటానని పాల్ అనడం.. నాగబాబు తనలా డ్యాన్స్ చేయలేడని తైతక్కులు ఆడడం.. వైఎస్ జగన్ తనకు పోటీకాదనడం.. ఇలా ఎన్నో చిత్రవిచిత్రమైన వేషాలకు కేఏపాల్ కేంద్ర బిందువయ్యాడు.

ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి. యూట్యూబ్ చానెళ్లకు - మీడియాకు - ప్రజలకు కామెడీకి కేరాఫ్ అడ్రస్ గా మారిన కేఏపాల్ కామెడీ ముగిసిపోయింది.. ఆయన కామెడీ ఇక ఏపీ రాజకీయ యవనికపై కనిపించదని తెలిసి.. ఆయన అభిమానులు - సాధారణ ప్రజానీకం కూడా ఆందోళన చెందుతున్నారు.

ఏపీలో జగన్ సీఎం అవ్వడం ఖాయమని.. కేంద్రంలో మోడీ వస్తాడని స్వయంగా కేఏపాల్ చెప్పేశాడు. వాళ్లే గెలువబోతున్నారని చెప్పాడు. ఇక కేఏపాల్ వెళ్లిపోతాడా? తన మానాన తను ఏపీకి వదిలిపెడుతాడా అన్న టెన్షన్ అందరినీ వెంటాడుతోంది. యూట్యూబ్ స్టార్ గా - సోషల్ మీడియా కింగ్ లా ఇన్నాల్లు అందరినీ ఉర్రూతలూగించిన కేఏ  పాల్ నెక్ట్స్ ఏమీ చే్స్తాడనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

ఎందుకంటే ఈ ఏపీ ఎన్నికల్లో కేఏ పాల్ ప్రభావం మామూలుగా లేదు. ఎక్కడ చూసినా కేఏ పాల్ ప్రచారం సందర్భంగా చేసిన కామెడీ వీడియోలు యూట్యూబ్ లో ట్రెండింగ్ అయ్యాయి. లక్షల వ్యూస్ తో జనాలకు ఎంటర్ టైన్ మెంట్ పంచాయి. ఏపీలో ఎంత సీరియస్ పాలిటిక్స్ నడిచినా మధ్యలో కేఏపాల్ చేసిన కామెడీ వీడియోలు చూస్తే చాలు జనాలు రిలాక్స్ అయ్యారు. నాయకులు కూడా ఈయన తెంపరితనానికి డైవర్ట్ అయ్యేవారు.

అయితే ఇప్పుడు ఎన్నికలు ముగిసిపోయాయి. మరి ఇప్పుడు కేఏ పాల్ కామెడీ చేయడానికి ఏం మిగల్లేదు. ఆయన వీడియోలు ఇక రావేమో అని అందరూ తెగ బాధపడితున్నారు. ఆయన అభిమానులు మాత్రం కంగారు పడిపోతున్నారు.

కేఏ పాల్ లో మంచి నటుడున్నారు..ఆయన బాబు-జగన్-పవన్ ను అనుసరించిన చేసిన కామెడీ బాగా హిట్ అయ్యింది. ఈయన సినిమాల్లోకి వెళితే ఖచ్చితంగా గొప్ప కమెడియన్ స్టార్ అవుతాడని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు.  బ్రహ్మానందం ‘కిల్ బిల్ పాండే’ క్యారెక్టర్ తో షేక్ చేసినట్టే..  అలాంటి క్యారెక్టర్ ఒక్కటి దొరికితే చాలు వీరలెవల్లో కుమ్మేసి అవతల పడేస్తాడన్న చర్చ ఆయన అభిమానుల్లో సాగుతోంది.

నిజంగా కేఏపాల్ సినిమాల్లోకి వస్తే కనుక ఆయనను మించిన ఎంటర్ టైనర్ ఎవ్వరూ ఉండరని..కమెడియన్స్ అందరూ పోటీగా వచ్చాడని వణకడం ఖాయమని ఆయన అభిమానులు స్పష్టం చేస్తున్నారు. కేఏపాల్ గాని ఇండస్ట్రీలోకి వస్తే మిగతా కమెడియన్ల పరిస్థితి దారునంగా ఉంటుందని చెబుతున్నారు.  ఈ ఆలోచనకే టాలీవుడ్ కు కంగారు పెడుతోందట..  ఇలా కేఏ పాల్ కు వచ్చిన అభిమాన సంద్రంతో  ఆయన ఎప్పుడూ యాక్టివ్ గా ఉండాలని కోరుతున్నారు. కేఏపాల్ కు ఉన్నయూట్యూబ్ ఫాలోయింగ్ ఇమేజ్ ఆయనకు ఖచ్చితంగా సినిమాల్లో ప్లస్ అవుతుందని ఆశిస్తున్నారు. మరి పాల్ నిజంగా టాలీవుడ్ లోకి వస్తాడా? ఆ ఆలోచన ఉందో లేదో చూడాలి మరి..