మా భార్యలకు చెప్పే ముందే మీకు షేర్ చేస్తాం!-ఎన్టీఆర్

Mon Feb 06 2023 09:01:51 GMT+0530 (India Standard Time)

Junior NTR About Movie Updates

నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన అమిగోస్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ ముఖ్య అతిథిగా విచ్చేసిన జూనియర్ ఎన్టీఆర్ తన అభిమానులనుద్ధేశించి మాట్లాడుతూ .. వారి ఆత్రుత ఉత్సాహం వల్ల దర్శకనిర్మాతలు ఇబ్బంది పడుతున్నారని ఆ తొందరలో ఏదో ఒక అప్ డేట్ ఇచ్చేస్తుంటే అవి మీకు నచ్చడం లేదని వ్యాఖ్యానించారు.



నిరంతరం అప్ డేట్ లు ఇవ్వాలని మేకర్స్ ఒత్తిడి చేయడం మానుకోవాలని అభిమానులను అభ్యర్థించారు. నిజానికి కొన్ని సమయాల్లో మనం షేర్ చేయడానికి ఏమీ ఉండదు. ప్రతిరోజూ అప్ డేట్ లు ఇవ్వడం కష్టం. మీ ఆత్రుత ఉత్సాహాన్ని మేం అర్థం చేసుకున్నాము.

కానీ మీ అత్యుత్సాహం కారణంగా దర్శక నిర్మాతలపై ఒత్తిడి పెరుగుతోంది. ఒత్తిడి కారణంగా వారు కొన్ని యాథృచ్ఛిక విశేషాలను (అప్ డేట్ లు) విడుదల చేస్తున్నారు. మీకు అవి నచ్చకపోతే తిరిగి నిందిస్తారు. ఇతర చిత్రాల దర్శకనిర్మాతలు కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు.. అని అన్నారు.

ఏదైనా అప్ డేట్ ఉంటే మేం దానిని మా భార్యలతో పంచుకునే ముందు మీకు షేర్ చేస్తాము. ఎందుకూ..? .. ఎందుకంటే మీరు మాకు చాలా ముఖ్యం. నేను ఇతర నటీనటులు దర్శకనిర్మాతల తరపున కూడా మాట్లాడుతున్నాను. ఒక మంచి అప్ డేట్ ఉంటే మేం దానిని మీకు వెల్లడిస్తాము. దయచేసి కొన్ని ఏవో విషయాలను మీడియాలో చదివిన తర్వాత దర్శకనిర్మాతలపై ఒత్తిడి చేయడం మానుకోండి... అని సూచించారు.

నేడు తెలుగు చిత్ర పరిశ్రమ ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉంది. సినిమా తీయాలంటే చాలా ఫోకస్ చేయాలి. అత్యద్భుతమైన ఫలితం రావాలన్నదే నా కోరిక అని సముచితంగా మాట్లాడారు తారక్.

కొరటాల శివతో తన తదుపరి సినిమా ముహూర్తాన్ని ఈ నెలలో ప్లాన్ చేస్తున్నామని మార్చి 20న లేదా అంతకంటే ముందుగా రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభం కానుందని తెలిపారు. ఈ చిత్రం 5 ఏప్రిల్ 2024 న విడుదల అవుతుందని కూడా వెల్లడించారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.