ఆరేళ్ల వయసులోనే స్టార్ హీరోయిన్ కు ప్రపోజ్ చేశాడట

Mon Jan 17 2022 13:33:32 GMT+0530 (IST)

Juhi Chawla On Instagram

ఇప్పుడైతే క్రేజీ హీరో కానీ.. అప్పట్లో మాత్రం అతడికి ఆరేళ్లే. ఆ వయసులో.. అప్పటి యూత్ ను తన అందచందాలతో ఒక ఊపు ఊపేస్తున్న హీరోయిన్ కు ప్రపోజ్ చేసిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తనను ఈ కుర్ర హీరో అప్పట్లో ప్రపోజ్ చేశాడని చెబుతూ.. నాటి ఆసక్తికర సంగతుల్ని షేర్ చేసుకుంది బాలీవుడ్ సీనియర్ నటి జూహీచావ్లా. 54 ఏళ్ల వయసులోనూ నలభైల్లో మాదిరి కనిపించే జూహీ.. తొంభైలలో యూత్ ను ఎంతలా డిస్ట్రబ్ చేసిందో అప్పటి వారిని ఇప్పుడు అడిగినా సిగ్గు పడుతూ చెప్పేస్తారు. షారుక్.. అమీర్..సల్మాన్ లతో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన ఆమె.. ఇప్పటికి అడపదడపా నటిస్తూనే ఉంటుంది.కానీ.. ఆమె వయసుకు తగ్గట్లు తల్లిపాత్రలు ఇస్తామంటే మాత్రం కయ్యిమంటుంది. అరవైలలో కూడా హీరోలకు కుర్ర హీరోయిన్లతో స్టెప్పులు వేయించే దర్శకులు.. హీరోయిన్ల విషయంలో మాత్రం జుట్టు నెరిసినట్లుగా చేసి.. అమ్మ పాత్రలకు పరిమితంచేయటంలో న్యాయమేంటి? అని ప్రశ్నించటమే కాదు.. తల్లి క్యారెక్టర్లకు ససేమిరా అనేస్తుంది. అందుకే.. ఆమెకు అలాంటి పాత్రల్ని ఆఫర్ చేయటానికి దర్శక నిర్మాతలు సైతం భయపడతారు.

ఈ మధ్యనే 5జీ నెట్ వర్కు మీద కోర్టును ఆశ్రయించటం.. న్యాయస్థానం ఆగ్రహానికి గురైన సంగతి తెలిసిందే. తాజాగా సోషల్ మీడియాలో ఆమె ఒకఆసక్తికర అంశాన్ని చెప్పుకొచ్చారు. బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్టు అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ గురించి తెలిసిందే. అతడి పుట్టిన రోజు సందర్భంగా ఆమె ఈ బర్త్ డే బాయ్ కు స్పెషల్ విషెస్ చెప్పటమే కాదు.. అతడు ఆరేళ్ల వయసులో ఉన్నప్పుడు చేసిన చిలిపి పని గురించి చెప్పి ఆశ్చర్యానికి గురి చేశారు.

1998లో అమీర్ ఖాన్.. జూహీ చావ్లా జంటగా నటించిన ‘ఖయామత్ సే ఖయామత్ తక్’ మూవీకి సంబంధించిన ఒక బాబు ఫోటోను షేర్ చేసి.. ఆ బాబు ఎవరో కాదని.. ఇమ్రాన్ ఖాన్ అని చెప్పింది. ఆరేళ్ల వయసులో ఉన్నప్పుడు ఇమ్రాన్ తనకు ప్రపోజ్ చేశాడని.. అప్పటి నుంచే ఈ వజ్రాన్ని తాను గుర్తుంచుకున్నట్లు చెప్పింది. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. నిండు నూరేళ్లు జీవించాలని కోరింది. ఆరేళ్ల వయసులోనే అదిరే అందంతో ఉండే జూహీకి అప్పట్లోనే ప్రపోజ్ చేసిన వైనం ఆమె బయట పెట్టటంతో.. ఇమ్రాన్ లోని మరో కోణం బయటకు వచ్చిందని సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు.