Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ లైనప్.. ఇవన్నీ ఎప్పుడొస్తాయో?

By:  Tupaki Desk   |   6 Feb 2023 6:00 PM GMT
ఎన్టీఆర్ లైనప్.. ఇవన్నీ ఎప్పుడొస్తాయో?
X
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో ఎన్టీఆర్ రామ్ చరణ్ కీలకపాత్రలు పోషించిన విషయం తెలిసిందే. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. అయితే ఈ సినిమాతో ఒక్కసారిగా ఇద్దరు హీరోలు పాన్ ఇండియా స్టార్లు గా మారిపోయారు. ఇక వారి నెక్స్ట్ ప్రాజెక్టుపై తెలుసుకోవాలనే ఆత్రుత అభిమానుల్లో మొదలైంది.

అయితే రామ్ చరణ్ మాత్రం ఆర్ సి 15 షూటింగ్లో బిజీ బిజీగా గడుపుతున్నారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసే పనిలో బిజీగా ఉన్నాడు రామ్ చరణ్. ఇక తన 16 వ సినిమాను కూడా రాంచరణ్ ప్రకటించాడు. తన 16వ సినిమాను బుచ్చిబాబుతో చేయనున్నట్లు వెల్లడించాడు. అయితే ఎన్టీఆర్ మాత్రం ఏ సినిమాను ఇప్పటివరకు పట్టాలెక్కించలేదు. చేతిలో సినిమాలో ఉన్న స్టార్ట్ అయ్యేది ఎప్పుడు అనేది క్లారిటీ లేకుండా పోయింది. కొరటాల శివ దర్శకత్వంలో తన 30వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వరకు షూటింగ్ కూడా ప్రారంభం కాలేదు

ఇక నిన్న కళ్యాణ్ రామ్ అమిగోస్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో ఎన్టీఆర్ ఎట్టకేలకు తన సినిమా అప్డేట్ ను అందించారు. ఈ ఫిబ్రవరి నాలుగో వారంలో షూటింగ్ మొదలవుతున్నట్లు తెలిపారు. ఇదిలా ఉంటే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా ప్రకటించి చాలా నెలలు దాటింది. అయినా ఇప్పటికీ అది పట్టాలెక్కలేదు. తమిళ దర్శకుడు వేట్రి మారన్ తో కూడా ఓ సినిమా చేస్తానని సమాచారం. అది కూడా ఇప్పటికీ పట్టాలెక్కలేదు. చేతిలో సినిమాలు ఉన్నప్పటికీ ఎన్టీఆర్ ఏ సినిమా మొదలుకాకపోవడంతో అభిమానుల్లో నిరాశ మొదలైంది.

వెట్రి మరన్ ప్రస్తుతం సూర్య తో ఓ సినిమాను తీస్తున్నాడు. ఆ సినిమా తర్వాతే ఎన్టీఆర్ తో వెట్రీ మారన్ సినిమా ఉందనున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీ రెండు భాగాలుగా ఉంటుందని సమాచారం. మొదటి భాగంలో ఎన్టీఆర్... రెండో భాగంలో ధనుష్ నటిస్తారని తెలుస్తోంది. ఈ ఈ విషయంలో అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.