ఆస్కార్ వేదికపై ఇద్దరు తెలుగు వాళ్ళు కనిపించారు - తారక్

Sat Mar 18 2023 10:09:35 GMT+0530 (India Standard Time)

Jr NTR I saw MM Keeravaani Chandrabose as two Telugu people at the Oscars ceremony

ఆస్కార్ అవార్డుల వేడుకలో స్టేజ్ మీద ఇద్దరు తెలుగు వాళ్ళు తనకి కనిపించారని జూనియర్ ఎన్టీఆర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాజాగా దాస్ కా దమ్కీ సినిమా ప్రీరిలీజ్ వేడుకలో జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తారక్ మాట్లాడుతూ ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ అవార్డు గెలుచుకోవడంపై ముందుగా ప్రస్తావించారు. ఆర్ఆర్ఆర్ చిత్రానికి పనిచేసిన అందరూ ఎంత కారణమో  ప్రేక్షకులు కూడా అంతే కారణం. దేశ వ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరాభిమానాల వలనే ఈ రోజు ఆస్కార్ వేదిక మీద అవార్డుని అందుకోగలిగా.మీ అభిమానం మమ్మల్ని అక్కడి వరకు తీసుకెళ్ళింది. ఆర్ఆర్ఆర్ ఆస్కార్ గెలుచుకుంది అంటే ప్రతి భారతీయుడు ప్రతి తెలుగువాడు గెలిచినట్లే. అయితే మీ అందరి తరపున  మేము అక్కడ పాల్గొన్నాం. ఆస్కార్ వేదిక మీద అవార్డుని కీరవాణి చంద్రబోస్ తీసుకుంటే ఇద్దరు భారతీయులు నాకు కనిపించారు. మరీ ముఖ్యంగా ఇద్దరు తెలుగువారు కనిపించారు. అక్కడ వేదిక తెలుగుదనంతో నిండిపోయింది. ప్రత్యక్షంగా ఆ దృశ్యాన్ని చూసి అద్భుతం అనిపించింది.

ఆర్ఆర్ఆర్ స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని సినిమాలు ఆస్కార్ కి వెళ్తాయని భావిస్తున్నా. ఇక విశ్వక్ సేన్ గురించి చెప్పాలంటే ముందు అతని  కాన్ఫిడెన్స్ గురించి మాట్లాడాలి. అతను మాట్లాడుతూ ఉంటే నేను చూస్తూ ఉండిపోతా. నాకు భాగా నచ్చిన సినిమాలలో ఈ నగరానికి ఏమైంది ఒకటి. అందులో అభినవ్ విశ్వక్ చేసిన పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవల్. ఫస్ట్ సినిమాలోనే నవ్వకుండానే నవ్వించాడు. ఇక ఫలక్ నుమా దాస్ సినిమాలో కూడా అతని కాన్ఫిడెన్స్ లెవల్ కనిపించింది. తరువాత అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాతో కంప్లీట్ గా తనని తాను మార్చుకొని నటుడిగా నిజంగా షాక్ ఇచ్చాడు.

ఇంత నేను ఒకే తరహా కథలతో వెళ్తున్న అని రియలైజ్ అయ్యి నన్ను నేను మార్చుకోవడానికి చాలా సమయం పట్టింది. ఇక హిట్ మూవీలో అయితే చాలా బ్యాలెన్స్ పెర్ఫార్మెన్స్ చేశాడు. తనని తాను ప్రూవ్ చేసుకోవాలని నటుడిగా కెరియర్ స్టార్ట్ చేశాడు. ఇక దాస్ కా దమ్కీ సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నా. ఎందుకంటే అలా అయినా తాను దర్శకత్వం ఆపేసి కొత్త టాలెంట్ కి  అవకాశం ఇస్తాడు. విశ్వక్ లాంటి నటుల కోసం మంచి కథలతో ఎంతో మంది టాలెంటెడ్ దర్శకులు వెయిట్ చేస్తున్నారు. వారికి విశ్వక్ అవసరం చాలా ఉంది. విశ్వక్ లాంటి నటులు ఇండస్ట్రీలో బలంగా నిలబడాలి. భాగా ఆడాలి. అప్పుడే మన తెలుగు సినిమాని నెక్స్ట్ లెవల్ కి తీసుకొని వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అని తారక్ చెప్పుకొచ్చాడు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.