Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్-తరుణ్ భాస్కర్ ల కాంబినేషన్ రానుందా..?

By:  Tupaki Desk   |   31 March 2020 4:30 PM GMT
ఎన్టీఆర్-తరుణ్ భాస్కర్ ల కాంబినేషన్ రానుందా..?
X
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమరం భీమ్ గా నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఎంతో ప్రతిస్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో రాజమౌళి పాన్ ఇండియా లెవెల్ లో ఎన్టీఆర్ ని పరిచయం చేస్తున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా పై ఎన్టీఆర్ భారీ ఆశలనే పెట్టుకున్నాడు. ఈ సినిమా అనంతరం ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో తన రెండో సినిమా చేయనున్నాడు. ఆ సినిమాకు 'అయినను పోయిరావలె హస్తినకు' అనే టైటిల్ ఖరారు చేసారు త్రివిక్రమ్ టీమ్. ఇక త్రివిక్రమ్ సినిమా తర్వాత ఎన్టీఆర్ ఎవరితో సినిమా చేస్తాడనే సందేహం అభిమానులలో ఏర్పడింది. ఈ సందేహం పై సోషల్ మీడియాలో పెద్ద చర్చే మొదలైంది.

అయితే ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా గురించి ఒక వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. పెళ్లిచూపులు సినిమాతో టాలీవుడ్ లోకి డైరెక్టర్ గా డెబ్యూ అయ్యాడు తరుణ్ భాస్కర్. మొదటి సినిమాతోనే ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకోవడమే గాక నేషనల్ వైడ్ ఫేమ్ పొందాడు. ఆ సినిమాతో విజయ్ దేవరకొండకు లైఫ్ ఇచ్చాడు. ఆ తర్వాత యూత్ ఫుల్ మూవీ 'ఈ నగరానికి ఏమైంది' తీసి మంచి మార్కులే కొట్టేసాడు. ఆ సినిమా తో విశ్వక్ సేన్ కి మరో లైఫ్ ఇచ్చాడు. తరుణ్ సినిమాలన్నీ యూత్ ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఆ తర్వాత సినిమా గురించి ఒక ఇంటర్వ్యూలో ఓపెన్ అయ్యాడు. తను ఒక కథను ఎన్టీఆర్ కి వినిపించాడట. ఆ కథ ఎన్టీఆర్ కి కూడా నచ్చడం తో చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్, అయినను పోయిరావలె హస్తినకు సినిమాల తర్వాత తరుణ్ తో సినిమా పట్టాలెక్కే అవకాశం ఉందని సినీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి.