విజయ్ ను డామినేట్ చేసిన రష్మిక

Mon Jan 30 2023 21:00:01 GMT+0530 (India Standard Time)

Jimikki Ponnu Video song Varisu Thalapathy Vijay

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కు దేశ వ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో చెప్పనక్కర్లేదు. రోజు రోజుకు సోషల్ మీడియాలో తన ఫోటోలతో హాట్ డోస్ పెంచుతూ ఫ్యాన్స్ ని మంత్రముగ్దుల్ని చేస్తుంది. తాజాగా ఆమె గ్లామరస్ షో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ను బీట్ చేసేలా ఉంది. అదేంటి పోలిక అనుకుంటున్నారా... అదేంటో చూద్దాం పదండి.కోలీవుడ్ హీరో దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ సినిమా వారిసు. ఈ చిత్రంలో తెలుగులో వారసుడు పేరుతో డబ్ అయ్యింది. దిల్ రాజు నిర్మాతగా మొదటి తమిళ సినిమను తెరకెక్కించారు. ఇక విజయ్ కి జోడీగా రష్మిక మందన్న నటించిన విషయం తెలిసిందే. మంచి అంచనాల నడుమ ఈ సినిమా జనవరి 14న విడుదలై తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లే రాబడుతోంది. ఎట్టకేలకు వారిసు సినిమా తమిళంలో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది.

అయితే ఈ సినిమా నుంచి జిమ్మిక్కి పొన్ను సాంగ్ రిలీజ్ అయ్యింది. ఈ పాటలో విజయ్ ని రష్మిక తన అందాలతో బీట్ చేసింది. ఆ పాటలో విజయ్ తో పోటాపోటీగా స్టెప్పులు వేస్తూ తన అందచందాలను ప్రదర్శించింది. ఇక ఈ సాంగ్ లో రష్మిక డ్రెస్సింగ్ కూడా బాగుంది. అందులోనూ ఆమె అందాల ఆరబోత మామూలుగా లేదు. ఇక ఈ పాట యూట్యూబ్లో సెన్సేషనల్ గా రికార్డు చూస్తే దూసుకెళ్తుంది. ఈ సినిమాకి తమన్ అందించిన మ్యూజిక్ ప్లస్ అయిందని చెప్పవచ్చు. ఈ సినిమాలో రష్మిక పాత్ర పై ట్రొల్స్ కూడా వచ్చాయి కేవలం పాటలకు అంకితమైన అంకితమైన అంటూ కామెంట్స్ వినిపించాయి. రష్మిక ఇటీవల ఈ విషయంపై స్పందించింది. అన్నీ తెలిసే... విజయ్ కోసమే సినిమా చేసినట్టు తెలిపింది.

విజయ్ కెరీర్లో 66వ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ రష్మిక తొలిసారిగా విజేత జట్టు కట్టింది. వీళ్ళ పెయిర్ చూసిన అభిమానులు కెమిస్ట్రీ వర్క్ అవుట్ అయ్యిందని సంబరపడిపోయారు. సినిమాకు తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పీవీపీ బ్యానర్లపై నిర్మాతలు దిల్ రాజు శిరీష్ పరమ్ వి పొట్లూరి పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.