Begin typing your search above and press return to search.

టైగ‌ర్ తో జాన్వీ రొమాన్స్ త‌ప్ప‌దంటోన్న అబ్బాస్!

By:  Tupaki Desk   |   7 Oct 2022 7:38 AM GMT
టైగ‌ర్ తో జాన్వీ రొమాన్స్ త‌ప్ప‌దంటోన్న అబ్బాస్!
X
బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీక‌పూర్ కెరీర్ దేదీప్య‌మానంగా సాగిపోతున్న సంగ‌తి తెలిసిందే. బ్యాక్ టూ బ్యాక్ ప్రాజెక్ట్ ల‌తో బిజీగా ఉంది. ఇటీవ‌లే 'గుడ్ ల‌క్ జెర్రీ'తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. డిస్నీ హాట్ స్టార్ లో రిలీజ్ అయిన సినిమాకు డివైడ్ టాక్ చ్చింది. కానీ జాన్వీ పాత్ర‌కి మాత్రం మంచి పేరొచ్చింది. జ‌య పాత్ర‌లో ఆద్యంతం ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంది.

ఆ పాత్ర‌ కొత్త ర‌క‌మైన ఇమేజ్ ని సైతం తీసుకొచ్చింది. ఆ ర‌కంగా న‌టిగా డే బై డే మ‌రింత షైన్ అవుతుంది. మ‌రోవైపు హీరోల‌తో ఘాటైన రొమాన్స్ సైతం పండిస్తుంది. ఇటీవ‌లే 'మిలీ'..'బవాల్' చిత్రాల‌ షూటింగ్ పూర్తిచేసింది. ప్ర‌స్తుతం 'మిస్ట‌ర్ అండ్ మిసెస్ మ‌హి' సినిమా షూటింగ్ ల్లో పాల్గొంటుంది. ఇంకా అమ్మ‌డి చేతిలో మ‌రికొన్ని ప్రాజెక్ట్ లు లాక్ అయి ఉన్నాయి.

ముఖ్యంగా ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ లో భారీ బ‌డ్జెట్ చిత్రాలు చేస్తోంది. ఈ నేప‌థ్యంలో జాన్వీ ఖాతాలో మ‌రో బిగ్ ప్రాజెక్ట్ చేరింది. అక్ష‌య్ కుమార్ ..టైగ‌ర్ ష్రాఫ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో అలీ అబ్బాస్ 'బ‌డేమియా ఛోటేమియా 'చిత్రాన్ని తెర‌కెక్కిస్తోన్న‌ సంగ‌తి తెలిసిందే. ఇందులో టైగ‌ర్ కి జోడీగా జాన్వీని అబ్బాస్ ప‌ట్టుబ‌ట్టి మ‌రీ ఎంపిక చేసిన‌ట్లు స‌మాచారం.

బాలీవుడ్ లో ఎంత మంది హీరోలు ఉన్నా తాను రాసుకున్న పాత్ర‌కి..టైగ‌ర్ కి జోడీగా జాన్వీ మాత్ర మే సూట‌వుతుంద‌ని ఆమె బిజీగా ఉన్నా? క‌న్విన్స్ చేసిన‌ట్లు తెలుస్తోంది. వ‌చ్చే నెల‌లో లండ‌న్ షెడ్యూల్ లో జాన్వీ షూటింగ్ లో పాల్గొంటుంద‌ని స‌మాచారం.

ఇందులో అమ్మ‌డు టైగ‌ర్ తో ఘాటైన రొమాన్స్ పండించ‌నుంద‌ట‌. టైగ‌ర్..జాన్వీ జోడీ తెర‌పై స‌రికొత్త‌గా ఆవిష్క‌రిస్తున్న‌ట్లు తెలుస్తోంది. జాన్వీ ఇలా ద‌ర్శ‌కుల పాలిట హీరోయిన్ గానూ వెలిగిపోతుంది.

అలాగే రేపో..మాపో ద‌క్షిణాదిన లాంచ్ అయిన ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు. టాలీవుడ్ లాంచింగ్ ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తోంది. స‌రైప పాత్ర‌.. అమ్మ‌డి ఇమేజ్ ని మ్యాచ్ చేసే హీరో...పెద్ద బ్యాన‌ర్ ఇలా అన్ని లెక్క‌లు ప‌క్కాగా కుద‌ర‌గానే తెలుగు తెర‌పైనా మెర‌వాల‌ని ఉవ్విళ్లురుతుంది. అందుకు త‌గ్గ‌ట్టు తండ్రి బోనీక‌పూర్ ప్ర‌ణాళిక సైతం సిద్దం చేస్తున్నారు. ప్ర‌స్తుతం బోనీక‌పూర్ కోలీవుడ్ లో వ‌రుస‌గా సినిమాలు నిర్మిస్తోన్న‌ సంగ‌తి తెలిసిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.