తల్లి ప్రేమ కూతురికి ఛాన్సిప్పించిందా?

Sun Dec 15 2019 23:00:01 GMT+0530 (IST)

Jeevitha Is Reason For Shivatmika Movie Offer in Krishna Vamsi Film

యాంగ్రీ హీరో రాజశేఖర్- జీవితల నటవారసురాలు శివాత్మిక `దొరసాని` సినిమాతో తెరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో శివాత్మిక కెరీర్ నల్లేరుమీద బండి నడకే అనుకున్నారు. కానీ ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోవడంతో కొంతవరకూ కెరీర్ గందరగోళంలో పడింది. వెంట వెంటనే చెప్పుకోదగ్గ ఆఫర్లు కూడా రాలేదు. అయితే సినిమా చేస్తాం అంటూ వచ్చిన రెండు మూడు ఆఫర్లని జీవిత తిప్పి పంపించారన్న మాటా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. కారణం ఏదైనా శివాత్మిక వాట్ నెక్స్ట్ అనే మీమీంసలో పడిపోయిందిట.దీంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు రంగంలోకి దిగిన జీవిత కూతురికి బంపర్ ఆఫర్ తగిలేలా సరైన స్కెచ్ వేశారని ఫిలింనగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. గత కొంత కాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్న క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ కొంత విరామం తరువాత ఆయన `రంగమార్తాండ` పేరుతో ఓ మరాఠీ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. సినీ రంగానికి చెందిన క్రేజీ నటులంతా ఇందులో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలోని ఓ పాత్ర కోసం శివాత్మికను వరించేలా చేయడంలో జీవిత మంత్రాంగం ఫలించిందట.

శివాత్మిక ఎంపిక గురించి ఇంతకుముందే రివీలైనా.. ఆ ఎంపిక వెనక మర్మాంగం మాత్రం తాజాగా రివీలైంది. ఇదంతా జీవిత ప్రోద్బలం .. కృష్ణవంశీ ఆఫర్ ఇవ్వడానికి కారణం జీవిత కృషి .. కూతురు పై తల్లి ప్రేమ ఈ ఛాన్స్ తెచ్చాయని చెబుతున్నారు.