అది డాన్స్ నా భాయ్!లేక ఎక్సర్ సైజా?

Mon Mar 20 2023 22:34:35 GMT+0530 (India Standard Time)

Jee Rahe The Hum Teaser trolls on salamn khan

ట్రోలర్స్ కి ఏ స్టార్ అతీతుడు కాదు.  ఎక్కడ తేడా జరిగినా ట్రోలింగ్ ఎదుర్కోవాల్సిందే. బాలీవుడ్ లెజెండ్ అమితాబచ్చన్ సైతం ట్రోలింగ్ కి గురైన వారే. ఆన్ స్ర్కీన్ అయినా ఆఫ్ ది స్ర్కీన్ అయినా ఎక్కడ దొరికినా స్టార్లపై ట్రోలింగ్ పీక్స్ లో జరుగుతుంది. తాజాగా మరోసారి సల్మాన్ ఖాన్ అడ్డంగా బుక్కయ్యాడు. ప్రస్తుతం ఆయన హీరోగా `కిసీకా భాయ్ కీసికా` జాన్ చిత్రంతో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.



ఇందులో  సల్మాన్ ఖాన్ స్వయంగా ఆలపించిన `జీ రహే ది హమ్` (ఫాలింగ్ ఇన్ లవ్) పాట టీజర్ రిలీజ్ అయింది. ఇందులో సల్మాన్ భాయ్ స్టెప్పులు కొరియోగ్రఫీ ఆద్యంతం నవ్వు తెప్పిస్తున్నాయి. సల్మాన్ బాడీ లాంగ్వేజ్కి అపాటకి ఏ మాత్రం సింక్ కాలేదు.దీంతో ఇదేదో కామెడీ కొరియోగ్రఫీలా ఉందంటూ నెటి జనులు ట్రోలింగ్ మొదలు పెట్టారు. సల్మాన్ ఖాన్ కి ఏ మాత్రం సరితూగని స్టెప్పుల్ని కొరియోగ్రాఫర్స్ కంపోజ్  చేస్తున్నారంటూ కామెంట్లు పడుతున్నాయి.

ఈ సినిమాకి సంబంధించి భాయ్ ఇలా దొరికిపోవడం రెండవసారి. ఇప్పటికే  ఈద్ సందర్భంగా విడుదలైన  రెండు పాటలు ట్రోలింగ్ గురయ్యాయి. అందులో  సల్మాన్ ఖాన్ డ్యాన్స్ల  ఉద్దేశించి ట్రోలర్స్ మామూలుగా దాడి చేయలేదు. ఈ పాటలో  కొన్ని కొత్త స్టెప్పులు ట్రై చేసాడు. అది డాన్స్ లా కాకుండా కార్డియో-ఎక్సర్సైజ్ రెజిమన్ లా  అనిపించింది. రెండు పాటల్లోనే ఒకే తరహాలో కనిపించారు.

అయితే భాయ్ కి ఇలాంటివి కొత్తేం కాదు. డాన్సుల విషయంలో సల్మాన్ ఖాన్ చాలా చూజీగానే ఉంటారు. కొరియోగ్రఫీ వీలైనంత తనకు కంపర్ట్ బుల్ గా ఉండేలా చూసుకుంటారు. సింపుల్ డాన్సులతోనే మెప్పించే ప్రయత్నం చేస్తారు. కిసీకా భాయ్ కిసీకా జాన్ లోనూ చేసింది అలాంటి ప్రయత్నమే. కానీ అవి ఇలా బెడిసి కొడతాయని ఊహించి  ఉండరు. ఇక భాయ్ పక్కన పూజాహెగ్డే ఆడిపాడింది.

కానీ పూజా మంచి డాన్సర్. ఎలాంటి స్టెప్పులైనా అవలీలగా చేయగలదు. అరబిక్ కుత్తూ సాంగ్ లో ఏ రేంజ్ లో ఆడిపాడిందో తెలిసిందే. ఆ పాటతో అమ్మడు మంచి డాన్సర్ గా ప్రూవ్ చేసుకుంది. మరి సల్మాన్ సినిమా కథ కంచికి చేరే సరికి ఇంకా ఇలాంటి సన్నివేశాలు ఎన్ని ఎదురవుతాయో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.