Begin typing your search above and press return to search.
పఠాన్ ఎఫెక్ట్.. ఆ సినిమా మార్కెట్ రూ.100 కోట్లు పెరిగిందట!
By: Tupaki Desk | 30 Jan 2023 5:00 PMబాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తాజాగా పఠాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. దశాబ్ద కాలంగా షారుఖ్ ఖాన్ సినిమా సక్సెస్ ను దక్కించుకోలేక పోయింది. అయినా కూడా ఈ సినిమా కు మొదటి నుండి పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. ఆ బజ్ తో సినిమాకు భారీ ఓపెనింగ్స్ నమోదు అయ్యాయి.
సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చిన నేపథ్యంలో మొదటి మూడు రోజుల్లో మూడు వందల కోట్లకు పైగా వసూళ్లు నమోదు అయ్యాయి. లాంగ్ రన్ లో పఠాన్ సినిమా 500 కోట్ల వసూళ్లను నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి అన్నట్లుగా బాక్సాఫీస్ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో షారుఖ్ ఖాన్ యొక్క తదుపరి సినిమా జవాన్ క్రేజ్ అమాంతం పెరిగింది.
తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో రూపొందుతూ ఉండటంతో పాటు తమిళ స్టార్ విజయ్ సేతుపతి కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. నయనతార మొదటి సారి బాలీవుడ్ లో ఈ సినిమాతో అడుగు పెట్టబోతుంది. అంతే కాకుండా తమిళ సూపర్ స్టార్ విజయ్ ఈ సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నాడట.
ఇన్ని ప్రత్యేకతలు జవాన్ కు ఉండటంతో పాటు షారుఖ్ పఠాన్ సినిమా తో భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో అంచనాలు మరింత పెరిగాయి. షూటింగ్ దశలో ఉన్న జవాన్ మార్కెట్ పఠాన్ విడుదలకు ముందు విడుదల తర్వాత అన్నట్టుగా పెరిగిందట.
ఏకంగా వంద కోట్ల వరకు అదనంగా షారుఖ్ ఖాన్ జవాన్ సినిమా పఠాన్ సక్సెస్ తో బిజినెస్ చేసే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
పఠాన్ మాదిరిగా జవాన్ సినిమాను కూడా దేశ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. పఠాన్ సినిమా సౌత్ లో ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేదు. కానీ జవాన్ సినిమా సౌత్ లో ముఖ్యంగా తమిళ్ లో భారీగా వసూళ్లు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి. జవాన్ సినిమా నుండి వచ్చిన గ్లిమ్స్ ఇప్పటికే సినిమాపై అంచనాలు పెంచాయి అనే విషయం తెల్సిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.