Begin typing your search above and press return to search.

ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరుపనున్న జాతిరత్నాలు.. ఎప్పుడంటే?

By:  Tupaki Desk   |   4 March 2021 5:52 PM GMT
ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరుపనున్న జాతిరత్నాలు.. ఎప్పుడంటే?
X
టాలెంటెడ్ ఇండస్ట్రీలో యువహీరోల సినిమాలు కూడా మంచి బజ్ తో భారీ ఓపెనింగ్స్ రాబట్టేలా ఈమధ్య తెరకెక్కుతున్నాయి. ఫస్ట్ సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోలు కూడా ఉన్నారు. అలాంటి టాలెంటెడ్ హీరోలలో ఒకరు నవీన్ పొలిశెట్టి. ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో.. రెండవ సినిమాగా జాతిరత్నాలు సినిమాతో రాబోతున్నాడు. ఇప్పటికే జాతిరత్నాలు సినిమా ప్రేక్షకులలో మంచి అంచనాలను క్రియేట్ చేసింది. ఎలాగంటే సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్, లిరికల్ సాంగ్స్ అంతలా ఆకట్టుకుంటున్నాయి సినీ అభిమానులను.. అలాగే తాజాగా విడుదల చేసిన ట్రైలర్ తో ఈ సినిమా పై అంచనాలు రెట్టింపు అవుతున్నాయని చెప్పవచ్చు. ఫుల్ లెన్త్ కామెడీ సినిమాగా తెరకెక్కిన జాతిరత్నాలు శివరాత్రి సందర్బంగా మార్చ్ 11న థియేటర్లలో విడుదల కాబోతుంది.

ఈ సినిమా ట్రైలర్ డార్లింగ్ ప్రభాస్ విడుదల చేసి జాతిరత్నాలు చిత్రబృందానికి బూస్ట్ ఇచ్చాడని చెప్పవచ్చు. ప్రభాస్ ట్రైలర్ లాంచ్ చేస్తున్నాడని తెలిసినప్పటి నుండే డార్లింగ్ ఫ్యాన్స్ కూడా జాతిరత్నాలు సినిమా గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను కేవీ అనుదీప్ దర్శకత్వం వహించాడు. పిట్టగోడ అనే సినిమాతో పరిచయమైన అనుదీప్ రెండో సినిమాగా జాతిరత్నాలు తెరకెక్కించాడు. అలాగే ఈ సినిమాతో దర్శకుడు కాస్తా నిర్మాతగా మారుతున్నాడు. అతనెవరో కాదు మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్. మొదటి ప్రయత్నంగా జాతిరత్నాలు మూవీతో నిర్మాణంలో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ఫరియా అబ్దుల్లా నటించగా.. కీలకపాత్రలలో ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ నటించారు. ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్రయూనిట్ మార్చ్ 7న ప్రీరిలీజ్ ఈవెంట్ జరుపనుంది. హన్మకొండలోని కాకతీయ డిగ్రీ కాలేజీలో సాయంత్రం 6గంటల నుండి జాతిరత్నాలు ప్రీ రిలీజ్ జరగనుందని మేకర్స్ ప్రకటించారు.